TV9 Vs NTV: జర్నలిజాన్ని భ్రష్టు పట్టించారు: ఇంకా ఈ ” నంబర్ వన్” సంబరాలు దేనికి టీవీ9, ఎన్టీవీ?

ఆమధ్య టీవీ9 తాను నెంబర్ వన్ ప్లేస్ కి వచ్చినట్టు ప్రకటించుకుంది. బంజారాహిల్స్ లో కట్టుకున్న విలాసవంతమైన భవనంలో వేడుకలు చేసుకుంది. రజనీకాంత్ విక్టరీ సింబల్ చూపించాడు. మురళి కృష్ణ జబ్బలు చరిచాడు.

Written By: K.R, Updated On : May 26, 2023 9:08 am

TV9 And NTV

Follow us on

TV9 And NTV: వార్తను వార్తలాగా చూపించడమే అసలైన పాత్రికేయమంటారు నండూరి రామ్మోహన్ రావు. వార్త లక్షణాలు పుణికిపుచ్చుకోలేనివాడు అసలు పాత్రికేయుడే కాదు అంటారు బూదరాజు రాధాకృష్ణ. వాళ్లు గతించారు. ప్రమాణాలు కూడా గతిస్తున్నాయి. “ఏవి ఏవి తండ్రీ? నిరుడు కురిసిన హిమకుసుమములు” అని ప్రశ్నించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ఏ ఒక్కరో కారణం కాదు.. ఈ ఒక్కరి వల్ల ఇది బాగుపడే అవకాశం లేదు. అంతా నానా జాతి సమితి అయిపోయింది. వాక్యాడంబరం కంటే వాగాడంబరం ఎక్కువైపోయింది. ఫలితంగానే రుధిర దేవీలు పుట్టుకొస్తున్నారు. అలాంటివారే పెత్తనం చెలాస్తున్నారు. ఇంతటి దురవస్థలో కూడా నెంబర్ వన్ ర్యాంకు కోసం చానల్స్ పోటీ పడుతున్నాయి అంటే దాన్ని ఏమనుకోవాలి? అంటే బురదలో పడి దొర్లుతున్నాం కాబట్టి.. ఎవడు ఎక్కువ బురద పూసుకుంటే వాడే నెంబర్ వన్ అని చెప్పుకుంటున్నట్టుంది.

సంబరాలు ఎందుకు

ఆమధ్య టీవీ9 తాను నెంబర్ వన్ ప్లేస్ కి వచ్చినట్టు ప్రకటించుకుంది. బంజారాహిల్స్ లో కట్టుకున్న విలాసవంతమైన భవనంలో వేడుకలు చేసుకుంది. రజనీకాంత్ విక్టరీ సింబల్ చూపించాడు. మురళి కృష్ణ జబ్బలు చరిచాడు. ఇక ఆ దేవి ఎగిరి గంతేసింది. ప్రత్యూష ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. అక్కడికి ఏమో తను కొత్తగా ఆ ప్లేస్ సాధించినట్టు టీవీ9 యాజమాన్యం బిల్డప్ ఇచ్చింది. వాస్తవానికి ఇదే టీవీ9 గతంలో తన నెంబర్ వన్ ర్యాంకును పదిలంగా పూలల్లో పెట్టి ఎన్ టీవీకి అప్పగించింది. ఒక రకంగా చెప్పాలంటే టీవీ9 తో పోలిస్తే ఎన్ టివి విస్తృతి, నెట్వర్క్ చాలా తక్కువ. అయినప్పటికీ తన ప్లైన్ కవరేజీతో అది టీవీ9 స్థానాన్ని లాగేసుకుంది. మళ్లీ కొద్ది రోజుల తర్వాత కోల్పోయిన రాజ్యాన్ని టీవీ9 దక్కించుకుంది. ఇప్పుడు ఏకంగా కిరీటాన్ని కొల్లగొట్టినట్టు సంబరాలు చేసుకుంటోంది.

సోషల్ మీడియాలో యుద్దం

ఇది ఇక్కడితోనే సమసి పోతే బాగుండు. కానీ కొద్ది రోజుల క్రితమే ఎన్టీవీ, టీవీ9 స్టాప్ మధ్య సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా టీవీ9 రజినీకాంత్ ను వెక్కిరిస్తూ ఎన్టీవీ ఉద్యోగులు కొన్ని ఆడియోలు, వీడియోలు పోస్ట్ చేశారు. ఇంకా మరి కొన్ని వీడియోలు అయితే అత్యంత దారుణంగా ఉన్నాయి. అంటే ఈ లెక్కలో ఎన్టీవీ సుద్దపూసని కాదు. ఈ రెండు చానల్స్ కూడా ఒకే బాపతు. తక్కెడలో తూకం వేస్తే కాస్త అటు ఇటుగా కనిపిస్తాయి. ఇక ప్రస్తుతం బార్క్ రేటింగ్స్ లో టీవీ9 ఫస్ట్ ప్లేస్ లో ఉంది. కానీ రెండవ స్థానంలో ఉన్న ఎన్టీవీ కంటే జస్ట్ ఒక రేటింగ్ మాత్రమే తక్కువ. అది కూడా ఎప్పుడు పడిపోతుందో ఎవరికీ తెలియదు. రెండు చానల్స్ మధ్య అంత కీన్ ఫైట్ జరుగుతోంది. మళ్లీ ఎప్పుడు ఎన్టివిలో సంబరాలు ఉంటాయా? నరేంద్ర చౌదరి మళ్లీ జీతాలు పెంచుతాడా? చూస్తుంటే ఇది గెట్ల కాడి పంచాయతీల గా కనిపిస్తోంది. ఒకటి మాత్రం నిజం ఈ రెండు చానల్స్ కి మిగతా ఛానల్స్ చాలా దూరంలో నిలిచిపోయాయి. ఆల్ ఇండియా న్యూస్ ఇండియన్ లాంగ్వేజ్ ఛానల్స్ పొజిషన్ ఒక్కసారి పరిశీలిస్తే నిజానికి టీవీ9 ఫస్ట్ ప్లేస్ కు వచ్చినప్పటికీ బార్క్ అఫీషియల్ టేబుల్ ఇంకా ఎన్ టీవీ ని టీవీ9 కంటే మెరుగైన స్థానంలో చూపిస్తోంది. సేమ్ పాయింట్స్ ఉన్నప్పటికీ ఎన్ టి వి దే పై చేయి లాగ కనిపిస్తోంది. అయితే ఈ లెక్కన చూస్తే రజినీకాంత్ ఆ స్థాయిలో సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు అనిపిస్తోంది. ఇక టీవీ9 భారత్ వర్ష ఆల్ ఇండియా ఫోర్త్ ప్లేస్ లో కొనసాగుతోంది, టీవీ9 కన్నడ ఆరవ స్థానంలో ఉంది. టీవీ9 మరాఠీ కూడా బెటర్ పొజిషన్లో ఉంది. ఒక్క టీవీ9 గుజరాతి మాత్రమే దారుణమైన రేటింగ్స్ నమోదు చేస్తోంది. అంటే టీవీ9 గ్రూపు మళ్లీ గాడిన పడినట్టే అని అనుకోవాలి.

ఎన్టీవీ మార్కెట్ వీక్

ఇక ఒక పాయింట్ తేడాతో అగ్రస్థానం కోల్పోయిన ఎన్టీవీ యాజమాన్యానికి కొంచెం బాధ ఉండొచ్చు. కానీ హైదరాబాద్ మార్కెట్లో ఎన్టీవీ చాలా వీక్. దాన్ని ఎవడూ పట్టించుకోడు. ఎన్ టివి హైదరాబాద్ రీజియన్ లో ఐదో ప్లేసులో కొనసాగుతోంది. దానికి అత్యంత సమీపంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఉంది. ఈ మధ్య కాలంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇతర పార్టీల చానల్స్ కంటే ముందంజలో ఉండటం విశేషం. ఇక సాక్షి అయితే 9వ ప్లేసు, హెచ్ఎంటీవీకి అత్యంత దగ్గరగా ఉంది. నిజానికి టీవీ9, ఎన్టీవీ, వి6, టీ న్యూస్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మినహా హైదరాబాదులో వేరే తెలుగు న్యూస్ ఛానల్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఈటీవీ అయితే మరి దారుణం. అసలు అది ఈ జాబితాలోకి రాకపోవడం అత్యంత బాధాకరం. ఇక అర్బన్ పరిధిలో టీవీ9 నెంబర్ వన్, రూరల్ ఏరియాలో ఎన్టీవీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాయి.

నెట్ వర్క్ 18 నంబర్ వన్ స్థానం

ఇక జాతీయస్థాయి న్యూస్ చానల్స్ విషయానికొస్తే మొన్నటిదాకా నెంబర్ వన్ స్థానం కోసం నానా గడ్డి కరిచినా రిపబ్లిక్ టీవీ రెండవ స్థానంలో కుదురుకుంది. ఇక అంబానీ ఛానల్ నెట్వర్క్ 18 నెంబర్ వన్ ప్లేస్ లో కనిపిస్తోంది. ఇక దాని మిగతా భాషా చానల్స్ అత్యంత దారుణమైన రేటింగ్స్ నమోదు చేస్తూ డీలా పడుతున్నాయి. ఇక వాటి సైట్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నెట్ఫ్లిక్స్ ఓటిటి కంటే బూతు తో బొర్లాడుతున్నాయి. ముకేశ్ అంబానీ దేశంలో శ్రీమంతుడు కావచ్చు గాని.. చానల్స్ నడపడంలో అది అర్హత కాదు. కానేరదు.