BRO Teaser : పవన్ కళ్యాణ్ లుక్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తన మేనరిజంకి తగ్గట్లు వాటిని ఆయనే డిజైన్ చేసుకుంటారు. పవన్ నటించిన కొన్ని చిత్రాల లుక్స్ సెన్సేషన్స్ క్రియేట్ చేశాయి. బద్రిలో టక్ ఇన్ లో డీసెంట్ గా ఉంటాడు. జానీ మూవీలో బన్నీ ధరించి తలకు కర్చీఫ్ కట్టిన ఆ లుక్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. గుండుంబా శంకర్ మూవీలో ప్యాంటు మీద ప్యాంటు వేసి అందరికీ షాక్ ఇచ్చాడు. జల్సా మూవీలో పవన్ లుక్ బాగా పాపులర్ అయ్యింది. ఇక గబ్బర్ సింగ్ లుక్ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. పోలీస్ గెటప్ లో ఆయన చరిత్ర క్రియేట్ చేశాడు. ఎర్ర కండువా తలకు కట్టుకోవడం, భుజాన వేసుకోవడం అనే ట్రెండ్ సెట్ చేశాడు.
కాగా పవన్ కెరీర్ బిగినింగ్ లో చేసిన తమ్ముడు సూపర్ హిట్. ఆ మూవీలో ఆయన ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించారు. ఓ సాంగ్ లో పవన్ కళ్యాణ్ ఊరమాస్ గెటప్ ట్రై చేశాడు. ‘వయ్యారి భామ నీ హంస నడక’ సాంగ్ కోసం పవన్ కళ్యాణ్ లుంగీ కట్టి, బీడీ తాగుతూ కూలీగా మెప్పించారు. ఫారిన్ లొకేషన్స్ లో పవన్ కళ్యాణ్ ఇండియన్ కూలీ గెటప్ చాలా కొత్తగా ఉంటుంది.
ఆ సాంగ్ తో పాటు పవన్ కళ్యాణ్ లుక్ ప్రాచుర్యం పొందాయి. చాలా కాలం అనంతరం పవన్ కళ్యాణ్ ఆ లుక్ ట్రై చేశాడు. బ్రో టీజర్లో ఆయన్ని మనం కూలీ గెటప్ లో చూడొచ్చు. ఒకటిన్నర నిమిషం ఉన్న టీజర్లో పవన్ కళ్యాణ్ చాలా అవతారాలు ఎత్తారు. ఫ్యాన్స్ ఆశించే అన్ని కోణాలు ఈ మూవీలో ఉన్నాయని అర్థం అవుతుంది. మొత్తంగా బ్రో టీజర్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అద్భుతంగా ఉంది. సాయి ధరమ్, పవన్ కాంబో సిల్వర్ స్క్రీన్ పై అద్భుతం చేయడం ఖాయం.
దర్శకుడు సముద్ర ఖని బ్రో చిత్రాన్ని తెరకెక్కించారు. బ్రో తమిళ హిట్ మూవీ వినోదయ సితం రీమేక్. అయితే మూలకథను మాత్రమే తీసుకుని సమూల మార్పులు చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ అందించారు. టీజర్లో థమన్ బిజీఎమ్ ఆకట్టుకుంది. పీపుల్స్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. జులై 28న బ్రో వరల్డ్ వైడ్ విడుదల కానుంది.