Pawan Kalyan Jubilee Hills By Election: ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉంది. కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ పోటీ చేస్తుండగా, బీఆర్ఎస్ పార్టీ నుండి మాగంటి సునీత పోటీ చేస్తోంది. ఇరువురు పార్టీల నాయకులూ నువ్వా నేనా అనే రేంజ్ లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరోపక్క బీజేపీ పార్టీ కూడా అసలు తగ్గడం లేదు. ఇరు పార్టీలతో సమానంగా పావులు కదుపుతోంది. కానీ ప్రధాన పోటీలో లేదు కానీ, ఒక నిర్ణయాత్మక ఓటు బ్యాంక్ ని సాధించేంత స్థాయిలో మాత్రం ఉంది. బీజేపీ పార్టీ నుండి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. అయితే ఈ ఎన్నికల ప్రచారం లో బీజేపీ పార్టీ తరుపున ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పాల్గొంటాడని తెలుస్తోంది.
ఈమేరకు ఆ పార్టీ తెలంగాణ శంకర్ గౌడ్ మీడియా కి తెలిపాడు. ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ, జనసేన, తెలుగు దేశం పార్టీ కూటమి గా ఏర్పడి, ప్రభుత్వాన్ని స్థాపించి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ బీజేపీ తరుపున ఇప్పటికే మహారాష్ట్ర లో ఒకసారి ప్రచారం చేసాడు. ఫలితాలు ఎలాంటివి వచ్చాయో మనమంతా చూసాము. ఢిల్లీ ఎన్నికల ప్రచారం లో కూడా పాల్గొనాల్సింది, కానీ ఆరోగ్య సమస్యల కారణంగా వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నాడు. ఇలా దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా పవన్ కళ్యాణ్, లేదా చంద్రబాబు బీజేపీ పార్టీ తరుపున ప్రచారం లో పాల్గొంటున్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారం కూడా ఆ కోవకు చెందినదే. చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల ప్రచారం లో పాల్గొంటాడో లేదో తెలియదు కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం కచ్చితంగా ప్రచారానికి వస్తాడట.
అయితే ఎప్పుడు ప్రచారానికి వస్తాడు అనే దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. 11వ తేదీన పోలింగ్ జరగనుంది. 9 వ తేదీ వరకు పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ లో చేయాల్సిన ప్రోగ్రామ్స్ అన్నీ షెడ్యూల్ అయ్యాయి. కాబట్టి ఆయన 10 వ తేదీన ఎన్నికల ప్రచారం లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.