Venu Tottempudi: టాలీవుడ్ అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న హీరోలలో ఒకరు వేణు తొట్టెంపూడి(Venu Tottempudi). స్వయంవరం చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసిన వేణు, ఆ తర్వాత చెప్పవే చిరుగాలి, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు, పెళ్ళాం ఊరెళ్ళితే, ఖుషి ఖుషీగా, శ్రీ కృష్ణ 2006,యమగోల, గోపి గోపిక గోదావరి, ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరో గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని తెచ్చుకున్నాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ 2013 వ సంవత్సరం లో విడుదలైన ‘రామాచారి’ చిత్రం తర్వాత వేణు సినిమాలకు దూరమయ్యాడు. మధ్యలో హీరో అవకాశాలు వచ్చాయి, ముఖ్య పాత్రల అవకాశాలు కూడా వచ్చాయి. కానీ వేణు నటించడానికి ఇష్టపడలేదు. సినీ రంగానికి దూరంగా ఉంటూ, వ్యాపారం లో రాణిస్తూ ముందుకెళ్లాడు. అయితే చాలా కాలం తర్వాత ఆయన 2022 వ సంవత్సరం లో ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు.
Also Read: జూబిలీ హిల్స్ ఎన్నికల ప్రచారం లో పవన్ కళ్యాణ్..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం!
రవితేజ హీరో గా నటించిన ఈ చిత్రం లో వేణు ఒక పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ లో కనిపించాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఈ సినిమా హిట్ అయ్యుంటే వేణు సినిమాల్లో కొనసాగేవాడేమో తెలియదు కానీ, సినిమాలు చేయడానికి మాత్రం ఆయన ఆసక్తిగా లేనట్టు తెలుస్తుంది. కానీ ఈ సినిమా షూటింగ్ సమయం లోనే ఆయన ‘అతిధి’ అనే వెబ్ సిరీస్ కూడా చేసాడు. జియో హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ విడుదలై పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఇండస్ట్రీ లో తనకు ఎదురైనా చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చాడు. సినీ ఇండస్ట్రీ లో వేణు కి బాగా దగ్గరైన హీరోలలో ఒకరు జగపతి బాబు. ఆయనతో కలిసి ఈయన ‘హనుమాన్ జంక్షన్’, ‘ఖుషి ఖుషీగా’ వంటి చిత్రాలు చేసాడు.
ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమా షూటింగ్స్ సమయంలో జగపతి బాబు తో తనకు ఉన్న రిలేషన్ గురించి మాట్లాడుతూ ‘జగపతి బాబు గారితో పని చేయడం మంచి అనుభూతి. ఆయన కాంబినేషన్ లో సినిమాలు చేస్తున్నప్పుడు, ఏమైనా పాటలు ఉంటే నాతో వద్దు, వేణు తో చేయించండి అని అనేవాడు. అయితే ఆయన కారణంగా అప్పట్లో నాకు చాలా పెద్ద నష్టమే జరిగింది. ఒక వ్యక్తికీ అవసరమైతే 14 లక్షల రూపాయిల డబ్బులు ఇచ్చాను. జగపతి బాబు కి అతను బాగా కావాల్సిన వ్యక్తి. నేను గ్యారంటీ అని జగపతి బాబు చెప్తేనే ఇచ్చాను. కానీ ఆ తర్వాత నాకు అతను డబ్బులు ఇవ్వలేదు. నేను జగపతి గారిని అడగలేదు, అలా ఆ డబ్బులు పోయాయి. ఆరోజుల్లో 14 లక్షల రూపాయిలు అంటే చిన్న మొత్తం కాదు’ అంటూ చెప్పుకొచ్చాడు వేణు.