Pawan Kalyan OG: బిగ్ బ్రేకింగ్ : బైక్ రేస్ లో పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్ ఎన్నడూ చూడని యాంగిల్..ఇదేమి ట్విస్ట్ బాబోయ్!

ఇంటర్వెల్ సన్నివేశం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ది బెస్ట్ ఇంటర్వెల్ బ్లాక్ గా నిలిచిపోతుందని, ఈ సన్నివేశం వచ్చినప్పుడు థియేటర్స్ పరిస్థితి ఊహించుకుంటేనే భయం వేస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

Written By: Vicky, Updated On : October 21, 2024 1:03 pm

Pawan Kalyan OG

Follow us on

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రముఖ యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 70 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. మధ్యలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల కొన్నాళ్ళు తాత్కాలికంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇప్పుడు ఆయన ఆంధ్ర ప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా మారి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ జనాల్లోకి దూసుకుపోతున్నాడు. అలాగే మరోపక్క ఆపేసిన సినిమా షూటింగ్స్ ని కూడా ప్రారంభించాడు. గత కొన్ని రోజుల నుండి అమరావతి లో ‘హరి హర వీరమల్లు’ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్, ఈ నెలాఖరు లోపు ఆ సినిమాని పూర్తి చేసి, వచ్చే నెల ప్రారంభం నుండే ఓజీ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు.

అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లేని కొన్ని సన్నివేశాలకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని ఇటీవలే హైదరాబాద్ లో మొదలు పెట్టారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వం లో ఒక యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఆదివారం రోజు ఈ షూట్ లో హీరోయిన్ ప్రియాంక మోహన్, విలన్ ఇమ్రాన్ హష్మీ కూడా పాల్గొన్నారు. ఈ చిన్న షెడ్యూల్ లో ఇంటర్వెల్ సన్నివేశానికి సంబంధించిన లీడ్స్ ని పూర్తి చేస్తున్నారట. మరో రెండు రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ఆ తర్వాత నవంబర్ నెలలో విజయవాడ స్టేడియం లో మిగిలిన షూటింగ్ ని ప్రారంబిస్తారట. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనబోతున్నాడు. బైక్ రేస్ బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ సన్నివేశం గా ఇంటర్వెల్ బ్లాక్ ఉండబోతుందట. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ బైక్ రేస్ బ్యాక్ డ్రాప్ లో ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకొని అభిమానులు సంబరపడుతున్నారు.

ఈ ఇంటర్వెల్ సన్నివేశం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ది బెస్ట్ ఇంటర్వెల్ బ్లాక్ గా నిలిచిపోతుందని, ఈ సన్నివేశం వచ్చినప్పుడు థియేటర్స్ పరిస్థితి ఊహించుకుంటేనే భయం వేస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ గా ఉండడం వల్ల షూటింగ్ పూర్తి చేయలేకపోవడం తో విడుదల కాలేదు. ఆ తేదీన ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం విడుదలై ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా వసూళ్లను చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంత మంచి తేదీని వదిలేసమో అంటూ బాధపడుతున్నారు. అయితే మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 26 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.