Pawan Kalyan : గత ఏడాది జూన్ 12 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఎంత బిజీ గా ఉంటున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఎన్నికల సమయం లో ప్రచార కార్యక్రమాల కోసం తన చేతిలో ఉన్నటువంటి మూడు సినిమాలకు తాత్కాలిక విరామం ప్రకటించాడు. మళ్ళీ గత ఏడాది డిసెంబర్ నెలలో తిరిగి షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు కానీ, మధ్యలో ఏర్పడిన కొన్ని పరిస్థితుల కారణంగా మళ్ళీ షూటింగ్స్ ని ఆపేయాల్సి వచ్చింది. ఈ ఏడాది ప్రారంభమై నాలుగు నెలలు పూర్తి అయ్యే వరకు కూడా పవన్ కళ్యాణ్ తన బ్యాలన్స్ మూడు సినిమాలకు డేట్స్ ని కేటాయించలేకపోయాడు. ఎట్టకేలకు ఆయన మే ప్రారంభం లో ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రానికి డేట్స్ ని కేటాయించి ఆ చిత్రాన్ని పూర్తి చేసాడు.
Also Read : పవన్ కళ్యాణ్ సంచలన పోస్ట్!
ఈ సినిమా ఇప్పుడు వచ్చే నెల 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే విధంగా రీసెంట్ గానే ఆయన ‘ఓజీ'(They Call Him OG) మూవీ షూటింగ్ ని కూడా మొదలు పెట్టాడు. రీసెంట్ గానే మొదలైన ఈ షూటింగ్ కి సంబంధించిన విశేషాలను ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది. అక్కడ పవన్ కళ్యాణ్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అదే విధంగా రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్(Priyanka Arul Mohan) లపై ఒక హాస్పిటల్ సన్నివేశాన్ని చిత్రీకరించారని, ఈ సన్నివేశం లో కొన్ని ఫైట్ బ్లాక్స్ ని కూడా చిత్రీకరించారని తెలుస్తుంది. దీనిని బట్టీ చూస్తుంటే ఇందులో హీరోయిన్ ప్రియాంక మోహన్ డాక్టర్ క్యారక్టర్ లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ వారం లో మూవీ టీం ముంబై కి వెళ్లనుంది. అక్కడ దాదాపుగా పది రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ జరగబోతుందట. పవన్ కళ్యాణ్, విలన్ ఇమ్రాన్ హష్మీ లపై కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తారట.
ఈ షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించబోతున్నారని టాక్. ముందుగా సెప్టెంబర్ 5 న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ బయ్యర్స్ ఇచ్చిన సూచన మేరకు సెప్టెంబర్ 25 న విడుదల చేయబోతున్నట్టు లేటెస్ట్ సమాచారం. ఎట్టి పరిస్థితిలో జూన్ 10 లోపు ప్యాచ్ వర్క్ తో సహా ఈ చిత్రం షూటింగ్ ని పూర్తి చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత జూన్ 12 నుండి ఆయన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ మూడు సినిమాల తర్వాత ఆయన పూర్తి స్థాయిలో పరిపాలన పై ద్రుష్టి పెడతాడని తెలుస్తుంది. అంతే కాకుండా ఈ ఏడాది చివర్లో కానీ, లేదా వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఒక రూమర్ వినిపిస్తుంది.
Also Read : నేటి నుండి ఓజీ షూటింగ్ ప్రారంభం..పవన్ సెట్స్ లోకి అడుగుపెట్టేది ఆరోజే!