Pawan Kalyan Heroine: ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. అప్పుడే వయసు కోరికలు తీర్చుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ నేపథ్యంలో సినిమా హీరోయిన్లు అవకాశాల గొడవల్లో పడి వివాహ తంతును వాయిదా వేస్తున్నారు. దీంతో వారి వయసు అడవి కాచిన వెన్నెలగా మారుతోంది. దీంతో వయసు పైబడుతున్నా వారి వివాహం గురించి మాట ఎత్తడం లేదు.
తెలుగులో చాలా మంది సీనియర్లు పెళ్లి ఊసే ఎత్తడం లేదు. 50 వసంతాల్లోకి అడుగుపెట్టినా వారికి వివాహం గురించి పట్టింపు ఉండటం లేదు. ఇక పెళ్లి అనే ఊసే లేకుండా పోతోంది. ఫలితంగా వారి పెళ్లి వయసు దాటిపోయి బామ్మలుగా మారుతున్నారు.
పవన్ కళ్యాణ్ పక్కన బద్రితో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ అమీషా పటేల్ కూడా 50 ఏళ్లు చేరువ అవుతున్నా ఇంకా పెళ్లి చేసుకోలేదు. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన ఈమె ప్రస్తుతం సింగిల్ గానే ఉంటోంది. బాలీవుడ్ లో ఈమెకు అంతగా కలిసి రాలేదు.

46 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోకుండా సోషల్ మీడియాలో బికినీ ఫొటోలు పెడుతూ సెగలు పుట్టిస్తోంది. బాలీవుడ్ లో ఇండియాలో ఎవరూ లేనట్టు తాజాగా పాకిస్తాన్ నటుడితో ప్రేమలో పడింది. ఎఫైర్ కొనసాగిస్తోందని సమాచారం.
సినిమాలేవీ చేతిలో లేకపోవడంతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. తాజాగా అమీషా పటేల్ ఒక వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ‘ఇమ్రాన్ అబ్బాస్’ అనే పాకిస్తాన్ నటుడితో రోమాంటిక్ వీడియోలో నటించి అతడి ఒడిలో ఒదిగిపోయింది. ఆ యువ నటుడి కౌగిలిలో గట్టిగా హత్తుకొని రూమర్స్ కు తెరలేపింది.
పాకిస్తాన్ నటుడు ఇమ్రాన్ అబ్బాస్ తో ఈ బోల్డ్ బ్యూటీ డేటింగ్ చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇటీవలే బహ్రెయిన్ వెళ్లిన అమీషా పటేల్ అక్కడే ఇమ్రాన్ ను కలిసి ఇన్ స్టాలో రీల్ చేసినట్టు తెలుస్తోంది. అతడితో డేటింగ్ను అక్కడే షురూ చేసినట్టు తెలుస్తోంది. ఇమ్రాన్ తనకు అమెరికాలో కాలేజ్ ఫ్రెండ్ అని అంటోంది. ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని కవర్ చేస్తోంది. కానీ వాలకం చూస్తుంటే అతడితో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నట్టు కనిపిస్తోంది.
