Allu Family Vs Mega Family: కొణిదెల, అల్లు కుటుంబాల్లో అభిప్రాయ భేదాలు ఏర్పడినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. మెగాహీరో చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ మధ్య అవినాభావ సంబంధం ఉండేది. ఏ పని చేసినా వీరిరువురు కలిసి చేయడమే అలవాటుగా ఉండేది. వారి రెండు కుటుంబాల్లో ఎంతో అన్యోన్యత ఉండేది. అయితే గత కొద్ది కాలంగా అల్లు ఫ్యామిలీకి చిరు కుటుంబానికి మధ్య పొరపొచ్చాలు ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఆ మధ్య చిరంజీవి సినిమాల విషయంలో అల్లు అరవింద్ కథలు విని ఓకే చేసేవారట. కానీ అందులో మంచి కథలు ఉంటే బన్నీకి ఇచ్చి మిగతావి చెప్పేవారట. దీంతో చిరు కుటుంబానికి చిర్రెత్తుకుపోయిందట.

అక్కడి నుంచి వారి కుటుంబాల్లో లోపాయకారి కోపాలు మొదలయ్యాయని చెబుతున్నారు. ఇక అప్పటి నుంచి రెండు కుటుంబాలు కూడా ముబావంగానే ఉంటున్నట్లు సమాచారం. పైగా ఇటీవల కాలంలో అల్లు అర్జున్ నందమూరి కుటుంబంతో బాగా దగ్గ్గరగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, అర్జున్ ఇద్దరూ బావ అని పిలుచుకుంటూ ఒకరి సినిమా ఫంక్షన్లకు మరొకరు వెళ్తున్నారు. ఇదే కోవలో బాలయ్య తో ఓ షో ప్లాన్ చేసి దాన్ని కూడా హైలెట్ చేయడంతో ఇక నందమూరి కుటుంబంతోనే అల్లు ఫ్యామిలీ పెనవేసుకుపోతోందనే వాదనలు వస్తున్నాయి.
ఈనేపథ్యంలో అల్లు అరవింద్ తన తండ్రి అల్లు రామలింగయ్య పేరిట ఓ స్టూడియో నిర్మిస్తున్నారు. గండిపేట ప్రాంతంలో నిర్మించే స్టూడియోను అల్లు రామలింగయ్య జయంతి రోజున అక్టోబర్ 1న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీన్ని ప్రారంభించేది మెగాస్టార్ చిరంజీవి అని చెబుతున్నారు. దీంతోనైనా ఇరు కుటుంబాల్లో మనస్పర్దలు లేకుండా చేసుకోవాలని రెండు కుటుంబాలు భావిస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి కుటుంబంపై అరవింద్ కుటుంబం ఎందుకు అంతలా ఆగ్రహం పెంచుకున్నాయో తెలియడం లేదు.

గతంలో అల్లు అర్జున్ ఏ షో లో అయినా మెగాస్టారే నెంబర్ వన్. ఆయన ప్రోద్బలంతోనే తామంతా రాణిస్తున్నామని పలుమార్లు చెప్పడం తెలిసిందే. కానీ అల్లు అర్జున్, రాంచరణ్ మధ్య కూడా ఎవరు గ్రేట్ అనే విషయంలో కూడా ఇద్దరి మధ్య వార్ జరుగుతున్నట్లు పుకార్లు వస్తున్నాయి. దీంతోనే ఇరువురు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. సినిమా పరిశ్రమలో ఇవన్నీ కామనే. కానీ దగ్గరగా ఉన్న రెండు కుటుంబాల్లో విష బీజాలు మొలవడం అంత మంచిది కాదు. ఇది ఎక్కడికో దారి తీస్తుంది. దీన్ని మొదట్లోనే తుంచేయకపోతే రెండు కుటుంబాలు అపార్థాలతో ఇంకా దూరం పెంచుకుంటాయనడంలో సందేహం లేదు. సో చిరు, అరవింద్ పెద్ద మనసు చేసుకుని తమ కుటుంబాల కోసం ఐక్యతగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతో ఉంది.