Pawan Kalyan OG Trailer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఆయన సాధించిన విజయాలు అతన్ని చాలా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాయి. ఇప్పటివరకు ఆయన ఏ సినిమా చేసిన కూడా అందులో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. మరి ఇప్పుడు ఆయన చేస్తున్న ఓజీ సినిమా ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా విషయంలో కూడా ఆయన చాలా కేర్ఫుల్ గా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాని చాలా రిచ్ గా తెరకెక్కించడమే కాకుండా సినిమాలోని సన్నివేశాలను సైతం చాలా గొప్పగా మలిచే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ సన్నివేశాల్లో తన యాక్టింగ్ తో అదరగొడతారనే విషయం మనకు తెలిసిందే. అత్తారింటికి దారేది సినిమా క్లైమాక్స్లో పవన్ కళ్యాణ్ అద్భుతమైనటువంటి నటనను కనబరిచాడు. అందుకే ఆ సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా మీదనే అందరి దృష్టి అయితే ఉంది… ఇక దీనికి సంబంధించిన ట్రైలర్ ని ఈరోజు ఉదయం 10 గంటల ఎనిమిది నిమిషాలకు రిలీజ్ చేస్తామంటూ మొదట అనౌన్స్ చేసినప్పటికి కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ ట్రైలర్ నైతే రిలీజ్ చేయలేదు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేస్తామంటూ చెబుతున్నారు.
మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన సినిమా కోసం ప్రతిసారి ఎదురు చూస్తూనే ఉంటారు. ఇంకా ఏదో విషయంలో సినిమా ట్రైలర్ డేట్లు, ట్రైలర్ రిలీజ్ టైం లు సైతం పోస్ట్ పోన్ అవుతుండటం వల్ల తన అభిమానులు కొంతవరకు నిరాశను వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
ముఖ్యంగా ‘ఓజీ’ సినిమా విషయంలో మాత్రం చాలా మంది చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో ట్రైలర్ రిలీజ్ చేస్తే ఆ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అవుతోంది అని ప్రతి ఒక్కరు అనుకుంటున్న సందర్భంలో ఈ ట్రైలర్ ని ఈ రోజు 10 గంటల 8 నిమిషాలకు రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇక లాస్ట్ మినిట్ లో పోస్ట్ పోన్ చేయడం అనేది నిజంగా బాధాకరమైన విషయమనే చెప్పాలి.
మరి పవన్ కళ్యాణ్ ఇంకా ఎన్నిసార్లు అభిమానులను నిరాశ పరుస్తూనే ఉంటాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ సినిమా ట్రైలర్ వస్తే గాని సినిమా ఎలా ఉండబోతోంది అనే దాని మీద ఒక క్లియర్ కట్ అంచనైతే రాదు. మరి ట్రైలర్ ని చూసి సినిమాని అంచనా వేయొచ్చు అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండడం విశేషం…