Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు తమ అభిమాన హీరో సినిమాకు బెనిఫిట్ షోస్ ని చూసి 8 ఏళ్ళు దాటింది. ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత ఆయన మూడు సినిమాలు చేస్తే, మూడింటికి బెనిఫిట్ షోస్ పడలేదు. కారణం జగన్ ప్రభుత్వం అనే సంగతి అందరికీ తెలిసిందే. ‘వకీల్ సాబ్’ చిత్రానికి భారీగా బెనిఫిట్ షోస్ ప్లాన్ చేశారు. కానీ చివరి నిమిషం లో ప్రభుత్వం అనుమతి కట్ చేసింది. టికెట్ రేట్స్ ని కూడా భారీగా తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సినిమా తర్వాత విడుదలైన ‘భీమ్లా నాయక్’, బ్రో చిత్రాలకు కూడా ఇదే పరిస్థితి. కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలకు మాత్రమే ఇలాంటి ఆంక్షలు ఉండేవి. మిగిలిన హీరోల సినిమాలు అన్ని రకాల బెనిఫిట్స్ తో విడుదల అయ్యేవి. అభిమానులు పాపం చూసి చాలా బాధపడేవారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ నెల 24 న హరి హర వీరమల్లు(Hari Hara Veeramallu) చిత్రం విడుదల కాబోతుంది. పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి. ఇక ఆయన సినిమాకు ఎదో ఫార్మాలిటీ కి అప్లికేషన్ పెట్టుకోవడమే కానీ, చితికి వేసినంత తేలికగా అన్ని అనుమతులు వచ్చేస్తాయి. కాసేపటి క్రితమే నిర్మాత AM రత్నం మీడియా తో ఒక ఇంటరాక్షన్ జరిపాడు. ఈ ఇంటరాక్షన్ లో ఆయన రెండు రాష్ట్రాల్లోనూ పైడ్ ప్రీమియర్ షోస్ ని ప్లాన్ చేస్తున్నామని, ప్రభుత్వాలకు అప్లికేషన్ కూడా పెట్టుకున్నామని, త్వరలోనే జీవో వస్తుందని చెప్పుకొచ్చాడు. ఈ వార్త తెలియగానే అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఇన్నాళ్ల తర్వాత మా అభిమాన హీరో కి సంబంధించి ప్రీమియర్ షోస్ ని చూసుకునే అదృష్టం కలగబోతుంది అంటూ సోషల్ మీడియా లో ఆనందంతో ట్వీట్లు వేస్తున్నారు. అయితే ‘హరి హర వీరమల్లు’ ఇప్పుడు మొదటి రోజు ఆల్ టైం రికార్డుని నెలకొల్పుతుందా లేదా అనేది చూడాలి.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం రికార్డు #RRR పేరిట ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రం 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రీమియర్ షోస్ నుండి పాజిటివ్ టాక్ వస్తే ‘హరి హర వీరమల్లు’ కి కూడా అదే స్థాయి వసూళ్లు వస్తాయని, ఆల్ టైం రికార్డు రాకపోయినా, కనీసం టాప్ 2 లో అయినా నిలుస్తుందని, చాలా బలమైన నమ్మకంతో చెప్తున్నారు ఫ్యాన్స్. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. విడుదలకు ముందు రోజే పైడ్ ప్రీమియర్ షోస్ వేస్తున్నాడంటే నిర్మాత రత్నం కి సినిమా ఔట్పుట్ పై ఎంత గట్టి నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఆరేళ్ళ నుండి ఎంతో కష్టపడి ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పని చేసాడు నిర్మాత రత్నం. ఆయనకు కచ్చితంగా ఈ సినిమా లాభదాయకంగా మారుతుందని ఆశిద్దాం.