https://oktelugu.com/

Pawan Kalyan- Mahesh Babu: మహేష్ కోసం 300 కోట్ల రూపాయిలు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ఇలాంటి త్యాగం ఎవ్వరూ చేసి ఉండరు!

మన టాలీవుడ్ లో ఎక్కువగా సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేసుకునే హీరోలు అప్పట్లో నందమూరి బాలకృష్ణ అయితే , ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు.

Written By: , Updated On : May 27, 2023 / 12:47 PM IST
Pawan Kalyan- Mahesh Babu

Pawan Kalyan- Mahesh Babu

Follow us on

Pawan Kalyan- Mahesh Babu: తెలుగు చలన చిత్ర పరిశ్రమకి ఎంతో ముఖ్యమైన సీజన్ సంక్రాంతి సీజన్. ఈ సీజన్ లో వచ్చే సినిమాలకు కలెక్షన్స్ ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లు వస్తుంటాయి. ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా తమ సినిమాలను విడుదల చేసుకోవడానికి సంక్రాంతి సీజన్ ని ఎంచుకుంటారు.

మన టాలీవుడ్ లో ఎక్కువగా సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేసుకునే హీరోలు అప్పట్లో నందమూరి బాలకృష్ణ అయితే , ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈయన ఫిల్మోగ్రఫీ ఒక్కసారి పరిశీలిస్తే 50 శాతం కి పైగా సినిమాలు సంక్రాంతి సీజన్ లోనే ఉంటాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ తో చేస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రం కూడా సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తారీఖున విడుదల కాబోతుంది. ఈ నెల 31 వ తారీఖున గ్లిమ్స్ వీడియో ని కూడా విడుదల చెయ్యబోతున్నారు.

ఇది ఇలా ఉండగా అదే సంక్రాంతి సీజన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మరియు ‘#OG’ చిత్రాలలో ఎదో ఒకటి విడుదల చెయ్యడానికి మేకర్స్ సన్నాహాలు చేసుకున్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కంటే ముందుగా #OG మూవీ రెగ్యులర్ షూటింగ్ పూర్తి అయ్యే ఛాన్స్ ఉండడం తో ఆ చిత్రాన్ని సంక్రాంతి కి విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని వాయిదా వేయించినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.

పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ ప్రాణ స్నేహితులు, అందుకోసం గానే త్రివిక్రమ్ రిక్వెస్ట్ చెయ్యడం తో పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి కి వచ్చే కమర్షియల్ సినిమాలకు కలెక్షన్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటాది. కనీసం 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఇచ్చే సెంటర్ ఇది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా, బాక్స్ ఆఫీస్ ని ఒక ఊపు ఊపే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా వెనక్కి తగ్గడం ఫ్యాన్స్ ని కాస్త నిరాశకి గురి చేసింది.