https://oktelugu.com/

Pavitra Lokesh Remuneration: పవిత్ర లోకేష్ ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గతంలో పవిత్ర లోకేష్ రోజుకు రూ. 50 వేలు తీసుకునేవారట. ఇప్పుడు దాని లక్షకు పెంచారట. అంటే డబుల్ చేశారట.

Written By:
  • Shiva
  • , Updated On : May 27, 2023 / 12:53 PM IST

    Pavitra Lokesh Remuneration

    Follow us on

    Pavitra Lokesh Remuneration: ఒకప్పుడు పవిత్ర లోకేష్ అంటే ఎవరికీ తెలియదు. ఆమె ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని తెలుసు కానీ పేరు, వివరాలు రిజిస్టర్ చేసుకునేంత ఫేమస్ కాదు. నరేష్ ఆమెను టాలీవుడ్ సెన్సేషన్ గా మార్చేశారు. సిల్వర్ స్క్రీన్ పై పవిత్ర లోకేష్ కనబడితే కుర్రాళ్ళు కేకలు వేస్తున్నారు. లేటు వయసులో ఘాటుగా ప్రేమించుకుంటున్న పవిత్ర-నరేష్ క్రేజీ కపుల్ గా అవతరించారు. ఈ పరిణామం పవిత్ర లోకేష్ కెరీర్ కి కూడా ప్లస్ అయ్యిందని సమాచారం. ఆమె రెమ్యూనరేషన్ డబుల్ అయ్యిందట.

    విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గతంలో పవిత్ర లోకేష్ రోజుకు రూ. 50 వేలు తీసుకునేవారట. ఇప్పుడు దాని లక్షకు పెంచారట. అంటే డబుల్ చేశారట. అయినా మేకర్స్ వెనుకాడటం లేదట. పవిత్ర లోకేష్ పేరు పరిశ్రమలో మారుమ్రోగుతుంది. అలాగే ఆమె ఆడియన్స్ మైండ్స్ లో బాగా రిజిస్టర్ అయ్యారు. దీంతో అడిగినంత ఇచ్చేందుకు సిద్ధం అంటున్నారట. పవిత్ర లోకేష్ కి ఆఫర్స్ కూడా పెరిగాయని వినికిడి. నరేష్ తో ఆమె బంధం మొదలయ్యాక పవిత్ర తెలుగులో ఎక్కువగా సినిమాలు చేశారు.

    నరేష్ కి భారీ డిమాండ్ ఉంది. ఈ క్రమంలో ఆయన నటించే సినిమాల్లో పవిత్ర లోకేష్ ని ఆయన రిఫర్ చేసే వాళ్ళట. ఆ విధంగా సెట్స్ లో కూడా కలిసి ఉండొచ్చని ఆయన ఆలోచనట. నాలుగేళ్లుగా పవిత్ర లోకేష్-నరేష్ సహజీవనం చేస్తున్నారు. అప్పటి నుండి పవిత్ర తెలుగులో బిజీ అయ్యారు. అయినా పవిత్ర లోకేష్ కి రెమ్యూనరేషన్ తో పని లేదు. ఆమె భర్త కాని భర్త నరేష్ కి వెయ్యి కోట్ల ఆస్తి ఉంది. జీవితాంతం కూర్చొని తిన్నా తరగనంత సంపద ఉంది. నా ఆస్తి విలువ వెయ్యి కోట్లకు పైమాటే అని నరేష్ స్వయంగా చెప్పారు.

    టీనేజ్ కపుల్ కి మించి ఘాడమైన ప్రేమలో నరేష్-పవిత్ర ఉన్నారు. ప్రపంచాన్ని చుట్టి రావాలి, అందమైన ప్రదేశాలను వీక్షించాలనేది వారి కోరిక అట. ఇప్పటికే కొన్ని దేశాల్లో విహరించినట్లు నరేష్ తెలిపారు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మళ్ళీ పెళ్ళి మే 26న విడుదలైంది. నరేష్-పవిత్ర లోకేష్ జీవితంలో చోటు చేసుకున్న యధార్థ సంఘటనల ఆధారంగా మళ్ళీ పెళ్లి తెరకెక్కింది.