Pawan Kalyan Movie Shooting: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నాయి…రోజువారి వేతనంతో పని చేసే సినీ కార్మికులు వాళ్ల అవసరాలర్థం సినిమా మీద వచ్చే వేతనాలు వాళ్లకు సరిపోవడం లేదని వాటి మీద 30% పెంచి వాళ్లకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వాళ్ల వాదనను ఫిలిం ఛాంబర్ ముందు ఉంచారు.ఇక మొత్తానికైతే అప్పటివరకు షూటింగ్లు చేసేదే లేదు అంటూ వాళ్ళు సమ్మెను నిర్వహించారు… ప్రొడ్యూసర్స్ అందరూ మీటింగ్ ని పెట్టుకొని ఈ టాపిక్ మీద చర్చించుకున్నారు. దీనివల్ల పెద్ద ప్రొడ్యూసర్లకు పోయేదేమీ లేదు కానీ, చిన్న చిన్న సినిమాలను చేసుకుంటూ వచ్చే ప్రొడ్యూసర్లకు మాత్రం తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని గమనించిన ఫిలిం ఛాంబర్ ఎవరికి ఎలాంటి వేతనాలను పెంచే ప్రసక్తే లేదు అంటూ కరాకండిగా చెప్పేసింది. కావాలంటే బయట వ్యక్తులతో సినిమా షూటింగ్లో నిర్వహించుకుంటామంటూ ఒక ప్రెస్ నోట్ ని కూడా రిలీజ్ చేసింది. దానికి సినీ కార్మికులు మాత్రం తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వేరే కార్మికులను తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీలో పనిచేయిస్తే మేము ఒప్పుకునేదే లేదు అంటూ సినిమా షూటింగ్స్ మొత్తాన్ని బంద్ చేశారు. ప్రస్తుతం ఆ బందు ను సక్సెస్ ఫు గా కొనసాగిస్తున్నారు. దీనివల్ల ప్రభాస్ ఫౌజీ సినిమాతోపాటు మిగతా సినిమా షూటింగ్ లు కూడా ఆగిపోయాయి.
Also Read: ‘జైలర్ 2’ లో బాలయ్య లుక్ రిలీజ్ చేయబోతున్నారా..?బాలయ్య క్యారెక్టర్ పేరేంటో తెలుసా..?
కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షెడ్యూల్ ని రేపటి నుంచి కంటిన్యూ చేస్తున్నారు…సినీ కార్మికుల సమ్మె వల్ల ఈ సినిమా షెడ్యూల్ ను మధ్యలో ఆపేశారు. కాబట్టి దాని మొత్తాన్ని ఫినిష్ చేయాలనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకోసమే పవన్ కళ్యాణ్ ఒక్క సినిమాను వదిలేసి మిగతా అన్ని సినిమాలకు బందును కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి పవన్ కళ్యాణ్ చాలా బిజీ షెడ్యూల్స్ లో ఉన్నాడు కాబట్టి ఆయన సినీ కార్మికులను రిక్వెస్ట్ చేసుకొని ఈ సినిమా షూటింగ్ చేసుకుంటున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్న కార్మికులకు 30% ఎక్కువ వేతనాలను కలిపి చెల్లిస్తారా? లేదంటే ఇంతకుముందు ఎంత అయితే చెల్లిస్తున్నారో అంతే ఇస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది… మరి ఈ షూట్ రేపటి నుంచి ప్రారంభమవుతోంది అనే వార్తలు కూడా వస్తున్నాయి.
Also Read: ‘కూలీ’ కి తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ టికెట్ రేట్స్..ఇదేమి దోపిడీ!
ఈ సినిమా షూట్ సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ అవుతుందా? లేదంటే కొన్ని కారణాలవల్ల ఈ షూటింగ్ ను నిలిపివేసే అవకాశం ఉందా అనే ధోరణిలో కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న కథనాల ప్రకారం సినిమా షూటింగ్ అయితే జరగబోతుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి వాటిలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే మాత్రం సినిమా యూనిట్ నుంచి ఎవరో ఒకరు స్పందించాల్సిన అవసరమైతే ఉంది..