Chandanagar Armed Robbery: అప్పట్లో ధూమ్ సినిమా వచ్చింది తెలుసా.. అందులో హృతిక్ రోషన్ చూస్తుండగానే దొంగతనం చేస్తుంటాడు. విలువైన వస్తువులను దొంగిలించి క్షణాల వ్యవధిలోనే మాయమవుతుంటాడు. ఆ సినిమాను ఆదర్శంగా తీసుకొని దొంగలు రెచ్చిపోతున్నారు. జన సమ్మర్థ ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతూ.. దోపిడీ చేస్తున్నారు. తాజాగా హైదరాబాదులో మంగళవారం దోపిడి దొంగలు చందానగర్ ప్రాంతంలోని ఖజానా జ్యువెలర్స్ లో విధ్వంసానికి పాల్పడ్డారు.
Also Read: ‘జైలర్ 2’ లో బాలయ్య లుక్ రిలీజ్ చేయబోతున్నారా..?బాలయ్య క్యారెక్టర్ పేరేంటో తెలుసా..?
హైదరాబాదులోని చందానగర్ ప్రాంతంలో ఖజానా జ్యువెలర్స్ కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో బంగారం లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. సిబ్బంది ఉదయం 9 గంటలకే వచ్చి కార్యాలయాన్ని తెరిచారు. బంగారాన్ని, నగదును సరి చూసుకున్న తర్వాత షాపులో లావాదేవీలు మొదలుపెట్టారు. లావాదేవీలు ప్రారంభమై ఐదు నిమిషాలు అయిందో లేదో.. ఇంతలోనే ఆరుగురు వ్యక్తులు ముఖాలకు మాస్కులు ధరించి షాపులోకి ప్రవేశించారు. వచ్చి రాగానే కాల్పులకు తెగబడ్డారు. ఏం జరుగుతుందో తెలిసేలోగానే దోపిడి దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. బంగారాన్ని బ్యాగుల్లో సర్దుకున్నారు. నగదును అందులో పెట్టుకున్నారు. దోపిడి దొంగల కాల్పుల వల్ల ఖజానా జ్యువెలర్స్ లో పనిచేస్తున్న డిప్యూటీ మేనేజర్ కాలికి గాయమైంది.
Also Read: కాళ్ళు లేని వ్యక్తి ‘బిగ్ బాస్ 9’ లోకి..పూర్తి వివరాలు చూస్తే మెంటలెక్కిపోతారు!
బంగారాన్ని, నగదును దోచుకున్న తర్వాత దోపిడి దొంగలు వేగంగా జహీరాబాద్ వైపు వెళ్లిపోయారు. దోపిడి దొంగలు సృష్టించిన బీభత్సం నుంచి ఖజానాలో పనిచేస్తున్న సిబ్బంది తేరుకోకముందే.. అక్కడ నుంచి పారిపోయారు.. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే అలెర్ట్ అయ్యారు. అంతేకాదు జిల్లాల సరిహద్దులను అలర్ట్ చేశారు. అయితే ఆ దోపిడి దొంగలు వేరే రాష్ట్రానికి చెందిన వారని.. కొద్దిరోజులుగా ఖజానా జ్యువెలర్స్ ప్రాంతంలో రెక్కీ నిర్వహిస్తున్నారని.. అదును చూసుకొని దోపిడీకి దిగబడ్డారని.. తుపాకులతో కాల్పులు చేపట్టారని స్థానికులు అంటున్నారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో కలకలం సృష్టించింది. దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కాగా, దోపిడి దొంగలు దోచుకెళ్లిన బంగారం విలువ ఎంత ఉంటుందనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఆ దొంగలను పట్టుకోవడానికి పోలీసులు సిసి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దింపారు.