https://oktelugu.com/

Allu Arjun: అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పెట్టుకున్నాడు.. ఇప్పుడు పుష్ప 2 పరిస్థితి ఏంటి..

ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ ఇండియన్ అభిమానులను కూడా తలెత్తుకునేలా చేయడానికి అల్లు అర్జున్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : May 16, 2024 / 02:36 PM IST

    Pawan Kalyan fans fires on Allu Arjun

    Follow us on

    Allu Arjun: స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. ఇక ఆయన పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఒక్కసారిగా తెలుగులో ప్రభంజనాన్ని సృష్టించాడనే చెప్పాలి.

    ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ ఇండియన్ అభిమానులను కూడా తలెత్తుకునేలా చేయడానికి అల్లు అర్జున్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే ఆయన రీసెంట్ గా ఏపీలో ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో కొన్ని కాంట్రవర్శిల్లో ఇరుక్కున్నాడు. ఇక నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శిల్ప రవిచంద్ర రెడ్డి కి మద్దతుగా ప్రచారం చేశారు.ఇక ఈ విషయం పవన్ కళ్యాణ్ కార్యకర్తల్లో గాని, ఆయన అభిమానుల్లో గాని తీవ్రమైన నిరాశని కలిగించిందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే తొందర్లోనే ఆయన చేసిన పుష్ప 2 సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.

    మరి ఇలాంటి క్రమంలో ఆయన పవన్ కళ్యాణ్ అభిమానులతో ఎందుకు ఏరీకోరీ మరి గొడవలు పెట్టుకుంటున్నాడు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఇలాంటి క్రమంలో ఆయన అందరికీ అనుకూలంగా ఉంటే మంచిది ఒక వర్గానికి కోపాన్ని తెప్పించి, మరొక వర్గాన్ని కూల్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఆయన సినిమాలే చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

    ఇక ఇప్పటికే ఒకసారి పవన్ కళ్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అన్నప్పుడే ఆయన చేసిన డీజే సినిమా టిజర్ కి కేవలం 24 గంటల్లోనే రెండు లక్షల డిస్ లైక్ లను కొట్టారు. మరి అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులతో మళ్ళీ పెట్టుకున్న అల్లు అర్జున్ వాళ్లని ఎదురించి పుష్ప 2 సినిమాతో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…