https://oktelugu.com/

Spirit Movie: స్పిరిట్ సినిమాలో కీలక పాత్రలో నటించనున్న మలయాళం స్టార్ హీరో…

బాహుబలి సినిమాతో దాదాపు 1900 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ప్రభాస్ ఈ సినిమాతో కూడా భారీ కలెక్షన్లను రాబడతాడు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఆయన సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : May 16, 2024 / 02:42 PM IST

    Malayalam star Hero play a key role in Spirit Movie

    Follow us on

    Spirit Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు ఉన్నప్పటికీ కొందరు మాత్రమే ఇక్కడ స్టార్ హీరోలుగా మంచి క్రేజ్ ను సంపాదించుకుంటారు. అలాంటి వాళ్లలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియాలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే జూన్ 27వ తేదీన ఆయన హీరోగా చేసిన కల్కి సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.

    ఇక ఈ సినిమాతో బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా ఇండియాలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాతో దాదాపు ఆయన 1500 నుంచి 2000 కోట్ల వరకు వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఇప్పటికే బాహుబలి సినిమాతో దాదాపు 1900 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ప్రభాస్ ఈ సినిమాతో కూడా భారీ కలెక్షన్లను రాబడతాడు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఆయన సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు.

    అయితే ఈ సినిమాతో మరోసారి బాలీవుడ్ లో ఉన్న ఇండస్ట్రీ రికార్డులు అన్ని బ్రేక్ చేయాలనే ఉద్దేశ్యం తోనే తను స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక సందీప్ రెడ్డి వంగ చేసిన సినిమాలు ఇంతకు ముందు ఎలాంటి ప్రభంజనాలను సృష్టించాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక రీసెంట్ గా ఆయన అనిమల్ సినిమాతో దాదాపు 1000 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టడంటే ఆయన పోటేన్షియాలిటీ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.

    ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ అయిన మమ్ముట్టి ప్రభాస్ ఫాదర్ గా నటించబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి…ఇక మమ్ముట్టి లాంటి నటుడు ఆ పాత్ర చేస్తున్నాడు అంటే ఆ పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉండే ఉంటుంది అని మరికొందరు వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…