Rocking Rakesh: జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ వైసీపీ మంత్రి రోజా కి సపోర్ట్ చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన కొంతసేపటికే ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. అయితే సదరు వీడియోను తన అకౌంట్ నుంచి రాకింగ్ రాకేష్ డిలీట్ చేశాడు. మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు రాకింగ్ రాకేష్ ని ట్రోల్ చేసిన క్రమంలో అతడు డిలీట్ చేశాడు. వివరాల్లోకి వెళితే .. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల పోరు హోరా హోరీ గా సాగుతుంది. చిన్న పెద్ద సెలెబ్రెటీలు తమ అభిమాన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ తరపున పలువురు సెలెబ్స్ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే జబర్దస్త్ కమెడియన్లు పిఠాపురంలో పాగా వేశారు. గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, రాకెట్ రాఘవ, హైపర్ ఆది ఇలా చాలా మంది పిఠాపురంలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు.
కాగా రాకింగ్ రాకేష్ మాత్రం మంత్రి రోజాకు మద్దతిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. మంత్రి రోజా పోటీ చేస్తున్న నగరిలో పర్యటించిన రాకింగ్ రాకేష్ ఓ ముసలి అవ్వను పలకరిస్తూ ఎవరికి ఓటేస్తావ్? అని అడిగాడు. ‘ఇంకెవరికి జగన్ కే మా ఓటు. మా ఇళ్లకు ఫించన్లు ఇస్తున్నారు .. ఇంటికి వచ్చి రేషన్ ఇస్తున్నాడు. జగన్ కి వేసినా .. రోజమ్మకి వేసినా ఒకటే కదా. మన మనిషిని ఎందుకు పోగొట్టుకుంటాం. నా ఫ్యామిలీలో ఉన్న 15 ఓట్లు జగన్ కే వేస్తాం’ అని ఆ వృద్ధురాలు చెప్పింది.
ఆ వీడియో మొత్తం రికార్డు చేసిన రాకేష్ ఇది నిజం అంటూ క్యాప్షన్ జోడించి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఇక వీడియో పై పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడ్డారు. నీ కెరీర్ క్లోజ్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో భయపడిపోయిన రాకేష్ దెబ్బకు వీడియో తన అకౌంట్ నుంచి తొలగించేశాడు. రోజాతో సన్నిహిత సంబంధాలున్న రాకింగ్ రాకేష్ ఆమెకు మద్దతు తెలిపే ప్రయత్నం చేశాడు. ,