Pawan Kalyan Ustad Bhagat Singh Shooting: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) జెట్ స్పీడ్ లో బ్యాలెన్స్ ఉన్న మూడు సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu), ‘ఓజీ'(They Call Him OG) చిత్రాలను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్, నేడు హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతున్నా ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad BhagatSingh) మూవీ షూటింగ్ లో పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ 50 రోజుల కాల్ షీట్స్ ని కేటాయించాడు. రోజుకి 14 గంటలు పని చేయడానికి ఆయన అంగీకరించాడు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ షూటింగ్ పార్ట్ ఈ నెల 13 లేదా 14వ తేదీ నుండి మొదలు అవ్వాలి. డైరెక్టర్ హరీష్ శంకర్ హీరోయిన్ శ్రీలీల మీద కొన్ని సన్నివేశాలను షూట్ చేసేందుకు ప్లానింగ్ చేసుకున్నాడు.
కానీ అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ నుండి ఫోన్ వచ్చిందట. ఈరోజు నుండే షూటింగ్ లో పాల్గొంటాను, సన్నివేశాలు రెడీ చేయండి అని అన్నాడట. దీంతో ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీ లో పవన్ కళ్యాణ్, శ్రీలీల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పది రోజుల పాటు ఈ షెడ్యూల్ హైదరాబాద్ లో కొనసాగనుంది. ఆ తర్వాత విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో షూటింగ్స్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే ఈ చిత్రం మొదటి నుండి తేరి చిత్రానికి రీమేక్ అంటూ ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. కానీ అలాంటిదేమి లేదని, ఇప్పుడు ఫ్రెష్ సబ్జెక్టు తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని, కేవలం ఈ సినిమా స్క్రిప్ట్ కోసం హరీష్ శంకర్ ఏడాది నుండి పని చేసాడని, తన నుండి నూటికి నూరు శాతం బెస్ట్ ఇచ్చేలా స్క్రిప్ట్ ని డిజైన్ చేసాడని తెలుస్తుంది.
అయితే పవన్ కళ్యాణ్ స్పీడ్ ని చూస్తుంటే ఈ చిత్రాన్ని ఆగష్టు నెలాఖరున కానీ, లేదా సెప్టెంబర్ మొదటి వారం లో కానీ పూర్తి చేసేలా అనిపిస్తున్నదంటూ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. సెప్టెంబర్ లోపు ఆయన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి పరిపాలన లో నిమగ్నమవ్వాలని అనుకుంటున్నాడట. ఈ మూడు సినిమాలు మాత్రమే కాకుండా, మరో కొత్త సినిమా కూడా ఆయన రాబోయే రెండేళ్లలో చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, లేదా సురేందర్ రెడ్డి ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తారట. నవంబర్ నెలాఖరు లోపు ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఆయన హీరో గా నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నది. జూన్ 12 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఇప్పుడు జులై నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
Power Storm Alert! ⚡#PawanKalyan has officially joined the shoot of #UstaadBhagatSingh
The set is on fire pic.twitter.com/ppd9mHkSHU— Milagro Movies (@MilagroMovies) June 10, 2025