Dhanush Comments On Rashmika Mandanna: తమిళ హీరో ధనుష్(Dhanush) ‘సార్’ తర్వాత నేరుగా తెలుగు లో చేస్తున్న రెండవ చిత్రం ‘కుబేర'(Kubera Movie). శేఖర్ కమ్ముల(Shekar Kammula) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కీలక పాత్ర పోషించాడు. రష్మిక(Rashmika Mandanna) ఇందులో హీరోయిన్ గా నటించింది. మూడేళ్ళ క్రితం ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఏడాదిన్నర క్రితం షూటింగ్ ని మొదలు పెట్టి రీసెంట్ గానే పూర్తి ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకొని రాబోతున్నారు. ముందుగా ఈ చిత్రానికి AR రెహమాన్ ని సంగీత దర్శకత్వం కోసం తీసుకున్నారు కానీ, ఆ తర్వాత ఆయన కొన్ని కారణాల చేత తప్పుకోవడం తో దేవిశ్రీ ప్రసాద్ ని రంగం లోకి దించారు. మొన్న విడుదల చేసిన టీజర్ లో దేవిశ్రీ ప్రసాద్ తన విశ్వరూపాన్ని చూపించినట్టుగా అనిపించింది. ఇక్కడే ఇలా ఉందంటే ఇక సినిమాలో ఏ రేంజ్ లో మ్యూజిక్ అందించి ఉంటాడో ఊహించుకోవచ్చు.
ఫస్ట్ హాఫ్ కి సంబంధించి రీ రికార్డింగ్ వర్క్ పూర్తి అయ్యింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా ఫస్ట్ హాఫ్ కి సంబంధించి పూర్తి అయ్యాయి. కానీ సెకండ్ హాఫ్ రీ రికార్డింగ్ వర్క్ ఇంకా చాలా వరకు బ్యాలన్స్ ఉంది. శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నారు, మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో మొదటి కాపీ సిద్ధం కానుంది. ఇకపోతే ఈ చిత్రం లోని రెండవ పాటని నేడు ముంబై లో లాంచ్ చేశారు మేకర్స్. ఈ ఈవెంట్ కి శేఖర్ కమ్ముల తప్ప మూవీ టీం మొత్తం పాల్గొనింది. ధనుష్ ఈవెంట్ ఆరంభం లో కాసేపు మాట్లాడి తర్వాత షూటింగ్ ఉండడం తో వెళ్ళిపోయాడు. ఆయన వెళ్లే ముందు ఈ మూవీ లో పని చేసిన అనుభూతి గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘మీ అందరినీ ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. దయచేసి క్షమించండి, నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రమే, కాస్త సర్దుకోండి. శేఖర్ కమ్ముల గారితో పని చేయడం ఒక అద్భుతమైన అనుభూతి. ఈ సినిమా కథ ని నాకు ఆయన కేవలం 20 నిమిషాలు మాత్రమే వినిపించాడు. చాలా థ్రిల్ కి గురయ్యాను, వెంటనే ఓకే చెప్పేసాను. ఆయన ఒక్క అద్భుతమైన పర్సనాలిటీ. ఈ సినిమా షూటింగ్ నాకు ఎన్నో వింత అనుభవాలను అందించింది. నేను, రష్మిక కలిసి దాదాపుగా 7 గంటల వరకు డంపింగ్ యార్డ్ లో షూటింగ్ చేసాము. నేను అయితే ఆ కంపు ని భరించలేకపోయాను కానీ, రష్మిక మాత్రం నాకు అలా ఏమి అనిపించలేదు సార్ అనింది(నవ్వుతూ). ఈ సినిమాలో నేను బిచ్చగాడి క్యారక్టర్ చేశాను. నటనలో నాకు సరికొత్త ఓనమాలు దిద్దించింది ఈ చిత్రం’ అంటూ ధనుష్ మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి.
View this post on Instagram