Kantara 2: ఈ ఏడాది సంక్రాంతి తర్వాత తెలుగు సినిమా పరిశ్రమకు పడిన దెబ్బలు సాధారణమైనవి కాదు. దెబ్బ మీద దెబ్బ, మధ్యలో కొన్ని సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి కానీ, అవి వీకెండ్ తర్వాత చల్లారిపోయేవి. పాపం బయ్యర్స్ నష్టాలను చూసి సంక్షోభం నుండి బయటపడలేక, సినీ ఇండస్ట్రీ మీద ఇష్టం తో వదిలి వెళ్లలేక నరకం చూశారు. అలాంటి సమయం లో సెప్టెంబర్ నెల టాలీవుడ్ కి ఒక గోల్డెన్ ఇయర్ లాగా మారింది అనడం లో ఎలాంటి సందేహం లేదు. చిన్న సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది. మొదటి వారం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 93 శాతం కి పైగా రీకవరీ ని సాధించి సెన్సేషన్ సృష్టించింది.
నేటి నుండి ఈ చిత్రం లాభాల్లోకి అడుగుపెట్టబోతుంది. ఎంత లాభాలు రాబోతున్నాయి అనేదే ఇక లెక్క, అదే విధంగా ‘కాంతారా 2′(Kantara 2 Movie) చిత్రానికి నిన్న ప్రీమియర్ షోస్ నుండి అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. USA ఆడియన్స్ యే ఈ సినిమా క్లైమాక్స్ మరియు కొన్ని సన్నివేశాలు చూసి మెంటలెక్కిపోయారంటే, ఇక రెగ్యులర్ షోస్ మొదలై, మన ఇండియన్ ఆడియన్స్ చూసిన తర్వాత టాక్ ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ఊహించడానికి కూడా కష్టమే. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం వండర్స్ క్రియేట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక మన తెలుగు ఆడియన్స్ గ్రాండియర్ చిత్రాలకు ఎలాంటి బ్రహ్మరథం పడుతారో మనమంతా చూసాము. ఈ చిత్రానికి కూడా అదే రేంజ్ లో బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంది. దేవుడికి సంబంధించిన కాన్సెప్ట్ కాబట్టి, ఫ్యామిలీ ఆడియన్స్ క్యూలు కట్టబోతున్నారు అని విశ్లేషకులు అంటున్నారు. మరో పక్క పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం కేవలం యూత్ ఆడియన్స్ కోసమే తీయబడిన సినిమా.
ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే సినిమా కాదు. కాబట్టి ఓజీ మేనియా కి కాంతారా బ్రేకులు వేసే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా పవన్ కళ్యాణ్ తన స్టామినా తో మ్యాజిక్ చేసి ‘కాంతారా 2’ ని కూడా తెలుగు స్టేట్స్ లో డామినేట్ చేస్తాడా అనేది చూడాలి. ఓజీ ఇక్కడి నుండి బాగా ఆడినా, ఆడకపోయినా వచ్చే నష్టం ఏమి లేదు. ఎందుకంటే ఈ చిత్రం అప్పటికే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేస్తుంది కాబట్టి. కానీ కాంతారా 2 మాత్రం చాలా బలంగా ఆడాల్సిందే. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 90 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి, ఆ రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది చూడాలి.