Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సహజంగానే తిక్క ఉంటుంది, దర్శకుడు క్రిష్ కి కొంచెం లైట్ గా పైత్యం ఉంటుంది. మరి ఈ తిక్క, ఆ పైత్యం ఎలా సింక్ అవుతాయి అనుకున్నారు హరిహర వీరమల్లు టీమ్ మెంబర్స్. కానీ.. వారు అనుకున్నట్లుగానే.. ఇప్పుడు సింక్ అవ్వలేదు. ఎందుకో తెలియదు, హరిహర వీరమల్లు సినిమా క్వాలిటీ మీద పవన్ బాగా అసంతృప్తిగా ఉన్నాడు. ఇది గ్యాసిప్ లాంటిదే అని అనుకోవడానికి వీలు లేదు.
గతంలో కూడా పవన్ ఈ సినిమా షూటింగ్ ను పలు సార్లు పోస్ట్ ఫోన్ చేసుకుంటూ వచ్చాడు. తాజాగా ఈ నెల 18న నుంచి జరగాల్సిన షెడ్యూల్ ను క్యాన్సిల్ చేశాడు. ఈ షెడ్యూల్ కోసం వేసిన రెండు భారీ సెట్లు అలా పడి వున్నాయి. అసలు షూట్ చేయాల్సిన సీన్స్ విషయంలో ఎందుకు పవన్ అంత అసంతృప్తిగా ఉన్నాడు ? ఎక్కడ లోపం జరుగుతుంది.
Also Read: Mahesh Babu Copying Titles: తన సినిమా టైటిల్ ని తానే కాపీ కొడుతున్న మహేష్ బాబు
ఇదే అర్థం కావడం లేదు క్రిష్ కి. మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలు పాత వాసన కొడుతున్నాయి. పవన్ కి ఆ డైలాగ్స్ అస్సలు కనెక్ట్ కావడం లేదు. డైలాగ్స్, సెట్ లు, కాస్ట్యూమ్స్ వగైరా విషయాలపై పవన్ నేరుగా క్రిష్ దగ్గరే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే 60 శాతం పూర్తి కాగా, అక్టోబర్ 5న విజయ దశమి సందర్భంగా విజయదుందుభి మోగించాలనుకుంటున్నారు.
అయితే, అది సాధ్యం కాదు. అసలుకే మొఘల్ కాలం నాటి కథతో తెరకెక్కుతోంది హరిహర వీరమల్లు సినిమా. కాబట్టి, సినిమా నేపథ్యానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. పైగా పవన్ కి ఈ సినిమాలో 3 షేడ్స్ కు సంబంధించి 3 డిఫరెంట్ గెటప్స్ ప్లాన్ చేశాడు క్రిష్. ఒకటి వజ్రాల దొంగ వీరమల్లు గెటప్ అయితే, సిక్కు సైనికుల్ని కాపాడే రక్షకుడిగా మరో గెటప్, అలాగే దేశం కోసం పోరాడే వీరుడిగా మరో గెటప్ లో పవన్ కనిపించబోతున్నాడు.
అన్నిటికీ మించి 17వ శతాబ్దం నాటి కథ కావడంతో.. పవన్ దుస్తులు, యాక్ససరీస్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇలా పవన్ పాత్రలో 3 డిఫరెంట్ షేడ్స్, గెటప్స్ ఉండటంతో చాల స్లోగా సాగుతుంది షూటింగ్. ఏది ఏమైనా దసరాకి మాత్రం సినిమా రిలీజ్ చేయాలని నిర్మాత రత్నం ప్లాన్. మరి ఏమవుతుందో చూడాలి.
Also Read:Punch Prabhakar: స్విజ్జర్లాండ్‌లో పంచ్ ప్రభాకర్… అయినా పట్టుకోని సీబీఐ!