Pawan Kalyan Discharged: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , తనని పదేళ్ల నుండి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న భుజాల నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకోవడానికి ముంబై కి వెళ్లిన సంగతి తెలిసిందే. కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆయనకు మూడున్నర గంటల పాటు జరిగిన సర్జరీ విజయవంతం అయ్యింది. గత మూడు రోజుల నుండి అదే హాస్పిటల్ లో విశ్రాంతి తీసుకుంటూ , డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న పవన్ కళ్యాణ్ , నేడు కాసేపటి క్రితమే డిశ్చార్జ్ అయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఈ సందర్భంగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఫోటోలను షేర్ చేస్తూ , డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపింది.
ఆమె మాట్లాడుతూ ‘నేడు హాస్పిటల్ నుండి మా ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా హాస్పిటల్ టీం మొత్తానికి హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలుపుతున్నాను. వాళ్ళు నా భర్త ఆరోగ్యం పట్ల ఎంతో కేర్ చూపించారు , సర్జరీ సమయం లో వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు ప్రశంసనీయం. ఈ హాస్పిటల్ డాక్టర్స్ చేతిలో సర్జరీ అన్నప్పుడే నేను చాలా రిలాక్స్ గా ఉన్నాను , ఎందుకంటే వాళ్ళు ఎంతో నైపుణ్యం గల సర్జన్స్ అని మాకు ముందు తెలుసు. ఈ సందర్భంగా పేరు పేరున ప్రతీ డాక్టర్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అంటూ ఆమె ఒక పోస్ట్ వేసింది. ఇది ఇలా ఉండగా వైద్యుల సూచనల మేరకు పవన్ కళ్యాణ్ మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది.
మూడు వారాల తర్వాత ఆయన ఫిజియోథెరపీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సర్జరీ చేసిన కుడి భుజం సాధారణ స్థితికి రావడానికి 4 నెలల సమయం పడుతుందట. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ముంబై హాస్పిటల్ నుండి డిశార్జ్ అయ్యి హైదరాబాద్ కి బయలుదేరిన పవన్ కళ్యాణ్ , తన నివాసం లోనే మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. అయితే హాస్పిటల్ లో సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా తన అధికారులతో ప్రభుత్వానికి సంబంధించిన రివ్యూ కార్యక్రమాలను ఆన్లైన్ ద్వారా నిర్వహించారు. ఇప్పుడు హైదరాబాద్ నుండి కూడా అలాగే చేస్తారా?, లేదా పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకుంటారా అనేది చూడాలి. అయితే పవన్ కళ్యాణ్ మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి , ఆయనకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా , ప్రభుత్వ నిధులు ఉపయోగించుకోవచ్చు , కానీ ఆయన ఒక్క పైసా కూడా ప్రభుత్వ నిధులు వాడుకోలేదట. తన సొంత డబ్బులతోనే సర్జరీ చేయించుకున్నారట. ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
