Deputy CM Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో అభిమానులు సైతం ఇష్టపడని చిత్రాలలో ఒకటి సర్దార్ గబ్బర్ సింగ్(Sardar Gabbar Singh). 2016 వ సంవత్సరం లో అత్యంత భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైంది. అర్థ రాత్రి షోస్ నుండే డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ, క్రేజ్ విపరీతంగా ఉండడం వల్ల మొదటి రోజు బాహుబలి రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి సంచలనం సృష్టించింది. ఆరోజుల్లో ఈ చిత్రం మొదటి రోజు వసూళ్లు బాహుబలి ని కొట్టడం నేషనల్ లెవెల్ లో ట్రెండింగ్ టాపిక్ అయ్యింది. సినిమా యావరేజ్ రేంజ్ లో ఉన్నా అప్పట్లోనే వంద కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి ఉండేది కానీ, సెకండ్ హాఫ్ పూర్తిగా గాడి తప్పడం తో వీకెండ్ తర్వాత వసూళ్లు భారీ గా డ్రాప్ అయ్యాయి. అయినప్పటికీ ఈ సినిమాకు ఆ రోజుల్లో ఇతర స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలతో సమానంగా వసూళ్లు వచ్చాయి.
ఆరోజుల్లోనే దాదాపుగా 53 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారు సూపర్ హిట్ సినిమాలతో కూడా 50 కోట్ల రూపాయిల కంటే తక్కువ షేర్ వసూళ్లను సాధించిన సినిమాలను అందించారు. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వేసిన డ్యాన్స్ లు అప్పట్లో అభిమానులకు కూడా థియేటర్స్ లో చూసేందుకు ఇబ్బందిగా అనిపించింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమాలోని వీణ స్టెప్పుని పవన్ కళ్యాణ్ అపహాస్యం చేస్తూ డ్యాన్స్ వేసాడు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్స్ నడిచాయి. ఇది కాసేపు పక్కన పెడితే సంగీత్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ వేసిన డ్యాన్స్ అప్పట్లో పెద్దగా గుర్తింపుని తెచుకోలేకపోయింది కానీ, ఇప్పుడు మాత్రం సెన్సేషనల్ అయిపోయింది. సోషల్ మీడియా లో ఈ సంగీత్ ఎపిసోడ్ కి సంబంధించిన డ్యాన్స్ క్లిప్ ని పవన్ కళ్యాణ్ దురాభిమానులు ట్రోల్ చేస్తూ వివిధ సూపర్ హిట్ సాంగ్స్ మ్యాషప్ చేసారు.
అవి సోషల్ మీడియా లో మామూలు రేంజ్ లో వైరల్ అవ్వలేదు. ట్రోల్ మెటీరియల్ ని చేద్దాం అనుకున్న వాళ్ళు ఒక్కసారిగా ఇది ట్రెండింగ్ టెంప్లెట్ గా మారిపోవడం తో షాక్ కి గురయ్యారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ ట్రెండ్ లో పాల్గొని, తమకు నచ్చిన పాటలతో ఆ డ్యాన్స్ బిట్ కి ఎడిటింగ్స్ చేసి వదిలారు. అలా ఎక్కడ చూసినా ఈ డ్యాన్స్ వీడియో నే సోషల్ మీడియా ని రూల్ చేస్తూ వచ్చింది. నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవ్వడంతో IMDB కూడా కాసేపటి క్రితమే ఈ వీడియో ని పోస్ట్ చేసింది. మీకు నచ్చిన బెస్ట్ ఎడిట్ ఏమిటి?, దానిని క్వాట్ చేయండి అంటూ ఒక ట్వీట్ వేసింది.
What’s the best edit of this sequence from #Sardargabbarsingh featuring @PawanKalyan you’ve seen so far?! pic.twitter.com/lp5he1jMcJ
— IMDb India (@IMDb_in) March 13, 2025