Pawan Kalyan: స్టాండప్ కామెడీ పేరుతో కొంతమంది కమెడియన్స్ ఈమధ్య మన హీరోలపై , రాజకీయ నాయకులపై చేస్తున్న చీప్ కామెడీ కి అభిమానులు ఎంతలా విరుచుకుపడుతున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గానే అనుదీప్ కాటికాల అనే కమెడియన్ మన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan), నిహారిక కొణిదెల(Niharika Konidela) , ఉపాసన కొణిదెల(Upasana Konidela) పై చేసిన చీప్ కామెంట్స్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఫైర్ అయ్యారో మనమంతా చూశాము. నేరుగా అతని కంపెనీ కి చెందిన కమెడియన్స్ ప్రదర్శన ఇచ్చే థియేటర్ కి వెళ్లి , అనుదీప్ ని కొట్టబోయారు. అంతే కాకుండా జనసేన నాయకులు అతనిపై పోలీస్ కేసు వేయడంతో కాకినాడ పోలీసులు , ఏకంగా ప్రయాగ్ రాగ్ కి వెళ్లి మరీ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన జరిగిన తర్వాత మరో స్టాండప్ కమెడియన్ ‘రఫీక్ మహమ్మద్’ పవన్ కళ్యాణ్ పై లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ , అదే విధంగా గతం లో చేసిన కొన్ని కామెంట్స్ కి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోస్ లో పవన్ కళ్యాణ్ పై అతను చేసిన కామెంట్స్ చూస్తే అభిమానులకు రక్తం మరగక తప్పదు. ఇతని షో కి వచ్చిన కొంతమంది ప్రేక్షకులు ‘పవన్ కళ్యాణ్ ని వైజాగ్ జనాలు రిజెక్ట్ చేశారు’ అని కామెంట్ చేయగా, రఫీక్ అందుకు సమాధానం చెప్తూ ‘పవన్ కళ్యాణ్ ని కేవలం వైజాగ్ జనాలు మాత్రమే కాదు, అతని ముగ్గురి భార్యలు కూడా రిజెక్ట్ చేశారు’ అంటూ చెప్పుకొచ్చాడు. మరో వీడియో లో ‘పవన్ కళ్యాణ్ ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని పిలుస్తున్నారు , కానీ నా ఫీలింగ్ ఏమిటంటే , పవన్ కళ్యాణ్ కచ్చితంగా బాహ్య సంబంధాల శాఖకు మినిస్టర్ గా వ్యవహరిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఒక రష్యా అమ్మాయిని పెళ్లిని చేసుకున్న ఏకైక ఇండియన్’ అంటూ చెప్పుకొచ్చాడు.
మరో వీడియో లో ‘పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎందుకు ప్యాకేజ్ అని పిలిస్తే అంత ఫైర్ అవుతున్నారు. నేను కేవలం శాలరీ ప్యాకేజ్ గురించి మాట్లాడుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. కామెడీ పేరుతో ఇంతటి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్న రఫీక్ ని వదిలేయడం ఎంత తప్పో మీరే అర్థం చేసుకోండి అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు ట్విట్టర్ లో పోలీసులను ట్యాగ్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. ఇతను చేసేది కామెడీ కాదని , కామెడీ పేరుతో తన మనసులో పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి ద్వేషాన్ని మొత్తం కక్కుతున్నాడని, ఇలాంటి వాళ్ళను కఠినంగా శిక్షించాల్సిందే అంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ నుండి ఒక రేంజ్ డిమాండ్ ఉంది. ఇతని వీడియోలు బాగా వైరల్ అవ్వడం తో , పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ నెల 18 న రఫీక్ వైజాగ్ లో నిర్వహించే స్టాండప్ కామెడీ ప్రోగ్రాం కి వెళ్లి ఇతని పని పట్టే ప్రయత్నం చేశారు. కానీ ఈ సమాచారం అందుకున్న రఫీక్ ఆ ఈవెంట్ ని రద్దు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేస్తారో లేదో చూడాలి.
derogatory standup comedian Rafiq on @APDeputyCMO , his wives @PawanKalyan , and on @naralokesh , making fun of government administration should not be taken lightly. @vizagcitypolice @Anitha_TDP please do strict action on him #Naralokesh #pawankalyan @JanaSenaParty @KSSRaoJSP pic.twitter.com/nvIgrjVRnV
— Sairamvenkat (@Srv_says) April 15, 2026