Ante Sundaraniki Pre Release Event: తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కల్యాణ్ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆయనకున్న అభిమానులు మరే హీరోకు లేరని తెలిసిందే. ఇక ఆయన ఏదైనా కార్యక్రమానికి వస్తున్నారంటే దానికి సందడి మామూలుగా ఉండదు. కోలాహలమే. అభిమానుల సందోహమే. ఈవెంట్ అదిరిపోవాల్సిందే. అంతా ఖుషీ అవుతారు. పవన్ కల్యాణ్ ఈవెంట్లకు వెళ్లడం కూడా తక్కువే. ఎప్పుడో నితిన్ హీరోగా తీసిన మూవీ ఇష్క్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరైన పవన్ మళ్లీ ఇప్పుడు నాని అంటే సుందరానికి సినిమా ప్రీరిలీజ్ వేడుకకు హాజరు కానున్నారు. దీంతో చిత్ర బృందం అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ వస్తున్నారంటే మామూలు విషయం కాదని అందరు ఎంతో జాగ్రత్తగా తమ పనులు చేసుకుంటున్నారు.

అభిమానులను ఎంటర్ టైన్ చేయడమే పవన్ కల్యాణ్ పని. అందుకే వారి కోరిక మేరకే అప్పుడప్పుడు ఇలాంటి ఈవెంట్లకు వస్తుంటారు. ఇదే తరుణంలో అంటే సుందరానికి సినిమా ఈవెంట్ కు కూడా రానున్నట్లు తెలుస్తోంది. జూన్ 9న శిల్ప కళా వేదికలో నిర్వహించే కార్యక్రమానికి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా రావడంపై హీరో నాని కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ రావడంపై ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Also Read: AP Politics: ఏపీలో పొత్తుల ఎత్తులు.. చిత్తయ్యేదెవరు? గెలిచేదెవరు?
పవన్ కల్యాణ్ రాకతో సినిమా రేంజ్ పెరిగిపోనుంది. పవన్ కు ఉన్న ఇమేజ్ దృష్ట్యా నాని సినిమా ఘన విజయం సాధించడం తథ్యమనే వాదన కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీస్ సంతోషం వ్యక్తం చేస్తోంది. అంతటి నటుడు మా సినిమా ఈవెంట్ కు రావడంపై అభినందనలు తెలియజేస్తోంది. అంటే సుందరానికి భారీ కలెక్షన్లు రావడం ఖాయమనే వాదన కూడా వస్తోంది. దీంతో పవన్ కల్యాణ్ సత్తా అంటే అదే. తన తోటి వారిని కూడా అంతే స్థాయిలో చూస్తారు. ఎవరి మీద కూడా ఎలాంటి భేదాభిప్రాయాలు ఉంచుకోరు. అందుకే అందరికి పవన్ కల్యాణ్ ఆరాధ్యుడుగా మారిపోయారు.

చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా విజయం సాధించడమే లక్ష్యం. దాని కోసం ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవడమే మన కర్తవ్యం. అందుకే పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా పిలిచి తమ సినిమా విజయవంతం అయ్యేందుకు దోహదం చేసుకోవాలని భావిస్తున్నారు. నాని కూడా పవన్ కల్యాణ్ రాక మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి అంటే సుందరానికి పవన్ కల్యాణ్ ఓ మందులా పనిచేయనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల నానికి చెప్పుకోదగ్గ విజయం దక్కలేదు. దీంతో నిరాశతో ఉన్నారు. భవిష్యత్ లో మరిన్ని సినిమాలు చేయాలంటే విజయం దక్కాల్సిందే. అందుకే పవన్ కల్యాణ్ ను నమ్ముకుని ఆయనను ఈవెంట్ కు పిలిచారు. ఆయన కూడా వారి కోరికను మన్నించి రావడానికి అంగీకరించారు. దీంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. పవన్ కల్యాణ్ లాంటి హీరో రావడం మాకు ఆనందం కలిగిస్తోందిన ట్విటర్ ద్వారా వెల్లడించారు.
Also Read:Jublihils Gang Rape Case: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు వెల్లడించిన సీపీ
[…] Also Read: Ante Sundaraniki Pre Release Event: హీరో నాని కోసం వస్తున్న … […]