Bigg Boss 9 Telugu Winner Kalyan Padala: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) టైటిల్ విన్నర్ పై సోషల్ మీడియా లో వస్తున్ననీ ఆరోపణలు ఏ సీజన్ లో కూడా రాలేదు. కనీసం టాప్ 5 లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కూడా అర్హత లేని పవన్ కళ్యాణ్ టైటిల్ గెలవడం ఏంటి?. అది కూడా ఇమ్మానుయేల్ ,తనూజ, డిమోన్ పవన్ లాంటి తోపు కంటెస్టెంట్స్ ని దాటుకొని?, ఇదెలా సాధ్యం? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియా లో ఉన్న రివ్యూయర్స్ అందరికీ ఓటింగ్ లో తనూజ టాప్ 1 స్థానం లో ఉంది అనే సమాచారం సాయంత్రానికి వచ్చేసింది. ఇప్పటి వరకు రివ్యూయర్స్ కి వచ్చిన సమాచారం తప్పు అయ్యినట్టు హిస్టరీ లో లేదు. అలాంటిది చివరి నిమిషం లో ఏమి జరిగింది?, ఎందుకు పవన్ కళ్యాణ్ ని విన్నర్ గా ప్రకటించారు అంటూ మండిపడుతున్నారు నెటిజెన్స్.
అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కి అసలు బిగ్ బాస్ హౌస్ లో స్క్రీన్ స్పేస్ రావడానికి ప్రధాన కారణం తనూజ. ఆమె ఎక్కడుంటే , అక్కడ ఉంటూ, ఆమెతో స్నేహం పెంచుకొని, తనవైపుకు ఆమెని తిప్పుకొని, గేమ్స్ విషయం లో కానీ, మోరల్ సపోర్ట్ విషయం లో కానీ, తనూజ అండగా నిలుస్తూ రావడం వల్లే పవన్ కళ్యాణ్ ఇంత దూరం వచ్చాడు, తనూజ లేకపోతే, పవన్ కళ్యాణ్ అసలు హౌస్ లో ఏ మూలాన ఉండేవాడో కూడా ఆడియన్స్ కి తెలిసేది కాదు, అలాంటి తనూజ ని పవన్ కళ్యాణ్ బయటకు రాగానే మర్చిపోయాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఒక ఫుడ్ బ్లాగ్ లో బిగ్ బాస్ 9 నుండి బయటకు వచ్చిన తర్వాత ఇచ్చిన మొట్టమొదటి ఇంటర్వ్యూ లో యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘మీకు హౌస్ లో ఒక బెస్ట్ ఫ్రెండ్ దొరికింది. ఆమె సపోర్ట్ వల్లే మీరు ఇంత దూరం వచ్చారు అంటే మీరు నమ్ముతారా?’ అని అంటాడు.
అప్పుడు పవన్ కళ్యాణ్ అందుకు సమాధానం చెప్తూ ‘గేమ్స్ పరంగా ఆమె నాకు సపోర్ట్ చేయలేదు. వ్యక్తిగతంగా, నేను కొన్ని సార్లు డౌన్ అయినప్పుడు ఆమె తన మాటలతో నన్ను సపోర్ట్ చేసింది’ అని చెప్పుకొచ్చాడు. ఇది విన్న నెటిజెన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. తనూజ గేమ్స్ లో సపోర్ట్ చేయలేదా? టవర్స్ టాస్క్ లో ఆమె చేతులు బాగాలేకపోయిన, నీకోసం ఆడింది మర్చిపోయావా?, ‘కళ్యాణ్ జోలికి ఎవరొస్తే..వాళ్ళ జోలికి నేను వెళ్తా’ అంటూ ఆమె ఆడిన క్షణాలు మర్చిపోయావా అంటూ నెటిజెన్స్ పవన్ కళ్యాణ్ ని నిలదీస్తున్నారు. ఒకటా రెండా, తనూజ లేని ప్రతీ గేమ్ లోనూ ఆమె పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తూ వచ్చింది. చివరి కెప్టెన్సీ టాస్క్ లో కానీ, టికెట్ టు ఫినాలే టాస్క్ లో కానీ పవన్ కళ్యాణ్ గెలిచాడు అంటే, అందుకు మూల కారణం తనూజ నే , అలాంటి తనూజ ని ఆయన మర్చిపోవడం ఆశ్చర్యానికి గురి చేసే విషయం.