Ritu Choudhary CID Investigation: బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీలు ,సోషల్ మీడియా సెలబ్రిటీలపై పోలీసులు తీవ్ర స్థాయిలో విరుచుపడుతూ, వారిపై కేసులు నమోదు చేసి విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఏకంగా CID నే రంగం లోకి దిగింది. గతం లో రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి , నటి అమృత చౌదరి వంటి వారు విచారణకు హాజరై కీలక సమాచారం అందించారు. ఇక నేడు ‘బిగ్ బాస్ 9’ కంటెస్టెంట్ రీతూ చౌదరి, బయ్యా సన్నీ యాదవ్, మంచు లక్ష్మి వంటి ప్రముఖులను CID అధికారులు విచారించారు. సుమారుగా రెండు గంటల పాటు విడివిడిగా వీళ్ళను విచారించారు. బెట్టింగ్ యాప్స్ ప్రొమోషన్స్ లావాదేవీలు మరియు స్తతెమెంత్ రికార్డ్స్ ని కూడా వీళ్ళ నుండి సేకరించారు. CID విచారణకు రీతూ చౌదరి హాజరు అవుతున్న సమయంలో అభిమానులు ఆమెకు సంబంధించిన వీడియో ని షూట్ చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేశారు. ఇది ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది.
ఇక రీతూ చౌదరి విషయానికి వస్తే రీసెంట్ గానే ఆమె ‘బిగ్ బాస్ 9’ షోలో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, అద్భుతమైన ఆతని కనబరుస్తూ టాప్ 8 కంటెస్టెంట్ గా నిల్చిన సంగతి తెలిసిందే. బాగా నెగిటివిటీ తో హౌస్ లోకి అడుగుపెట్టిన రీతూ చౌదరి, తిరిగి వెళ్ళేటప్పుడు, పాజిటివిటీ ని మూటగట్టుకొని వెళ్ళింది. కచ్చితంగా ఈమె టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలుస్తుందని అంతా అనుకున్నారు కానీ, ఏమైందో ఏమో తెలియదు కానీ, 13 వ వారం లోనే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఈమె ఎలిమినేషన్ అన్యాయం అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ఆమెకోసం నెటిజెన్స్ పోరాడారు. ఎంత నెగిటివిటీ తో లోపలకు వచ్చిన ఈమె, ఇలా పాజిటివిటీ తో బయటకు వెళ్తుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు ఆడియన్స్. ఇక రాబోయే రోజుల్లో ఈమె కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.