Bro Movie Collections
Bro Movie Collections: పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ బ్రో. దర్శకుడు సముద్రఖని తెరకెక్కించారు. జులై 28న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ వింటేజ్ గెటప్స్, స్క్రీన్ ప్రెజెన్స్, మేనరిజమ్స్ హైలెట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ సన్నివేశాలు బాగా పేలాయి. ఇక క్లైమాక్స్ లో ప్రేక్షకులను ఏడిపించేశారు. ఎమోషనల్ సన్నివేశాలతో హృదయాలు తాకారు. అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇటు సాధారణ ప్రేక్షకులకు కావలసిన అంశాలతో బ్రో మూవీ తెరకెక్కింది.
దీంతో ఫస్ట్ డే భారీ వసూళ్లు రాబట్టింది. వీకెండ్ వరకు బ్రో మూవీ వసూళ్లు సాలిడ్ గా ఉన్నాయి. అయితే వర్కింగ్ డేస్ లో బ్రో ది అవతార్ నెమ్మదించింది. తెలుగు రాష్ట్రల్లో వసూళ్లు రెండు కోట్లకు పడిపోయాయి. నాలుగు, ఐదు, ఆరు రోజుల్లో మరింతగా తగ్గుతూ వచ్చాయి. 7వ రోజు కూడా ఇదే ట్రెండ్ కనిపించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రో మూవీ 7వ రోజు రూ. 55 లక్షలు షేర్ రాబట్టినట్లు సమాచారం. వరల్డ్ వైడ్ మొత్తం ఒక కోటి లోపే ఉంటుంది.
ఫస్ట్ వీక్ ముగిసే నాటికి బ్రో మూవీ రూ. 60-62 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రాబట్టింది. ఈ వీకెండ్ బ్రో చిత్రానికి కలిసొచ్చే అవకాశం ఉంది. ఒక్క చెప్పుకోదగ్గ చిత్రం కూడా విడుదల కావడం లేదు. చెప్పాలంటే ఈ వారం కూడా బ్రో చిత్రానిదే.నెక్స్ట్ వీక్ మాత్రం రెండు భారీ చిత్రాలు జైలర్, భోళా శంకర్ విడుదల కానున్నాయి. కాబట్టి ఈ వీక్ లో బ్రో మెరుగైన వసూళ్లు సాధించే అవకాశం ఉంది.
బ్రో తమిళ చిత్రం వినోదాయ సితం రీమేక్ గా తెరకెక్కింది. పవన్ కళ్యాణ్ టైం అనే దేవుడు పాత్ర చేశారు. ఒరిజినల్ కి దర్శకత్వం వహించిన సముద్రఖని బ్రో చిత్రానికి పనిచేశారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. థమన్ సంగీతం అందించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు.