Pawan Kalyan Bro Movie Business: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఏ విషయమైనా సెన్సేషన్ అయిపోవడం అనేది సర్వ సాధారణం. రీసెంట్ గా ఆయన ‘బ్రో ది అవతార్’ చిత్రం లో నటించాడు. ఈ సినిమా తమిళం లో డైరెక్టు ఓటీటీ లో విడుదలైన ‘వినోదయ్యా చిత్తమ్’ చిత్రాన్ని ఆదర్శంగా తీసుకొని తెరకెక్కించారు. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా సాయి ధరమ్ తేజ్ కూడా నటించాడు.
ప్రియా ప్రకాష్ మరియు కేతిక శర్మ హీరోయిన్లు గా నటించారు. సముద్ర ఖని దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రీసెంట్ గానే విడుదలై సినిమాపై ఇంకా ఆసక్తి పెంచేలా చేసింది. అలాగే బయ్యర్స్ నుండి క్రేజీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఆఫర్లు కూడా వస్తున్నాయి. కేవలం నైజాం ప్రాంతానికే ఏకంగా 36 కోట్ల రూపాయలకు ఈ చిత్రం అమ్ముడుపోయినట్టుగా టాక్ వినిపిస్తుంది.
అంతే కాకుండా ఆంధ్ర రైట్స్ 45 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడుపోయినట్టు సమాచారం. అలా ఈ చిత్రం కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండే వంద కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకోబోతున్నట్టుగా సమాచారం. ఈ చిత్రం రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమా కాదు, పవన్ కళ్యాణ్ కూడా సినిమా మొత్తం ఏమి ఉండదు. కేవలం 45 నిమిషాలు మాత్రమే ఉంటాడు. ఈ 45 నిమిషాల పాత్రకు కేవలం ఆయన బ్రాండ్ ఇమేజి ని ఉపయోగించుకొని నిర్మాతలు బయ్యర్స్ కి భారీ రేట్స్ కి అమ్మేస్తున్నారు.
బయ్యర్స్ కూడా పవన్ కళ్యాణ్ రేంజ్ తెలుసుకాబట్టి ఎదురు చెప్పకుండా, నిర్మాతలు ఎంత అడిగితె అంత ఇచ్చేస్తున్నారు. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 130 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరో 20 రోజులు ఆగాల్సిందే.