Pawan Kalyan Movie Ticket Rates: అటు ఆంధ్ర ప్రదేశ్ లో కానీ , ఇటు తెలంగాణ లో కానీ సినిమా టికెట్ రేట్స్ విషయం లో ఈమధ్య కాలం లో పెద్ద రభస జరుగుతోంది. రెండు ప్రభుత్వాలు సినీ ఇండస్ట్రీ కి సానుకూలంగానే ఉన్నాయి. నిర్మాతలు అడిగినంత టికెట్ రేట్స్ ని పెంచుకునేందుకు అనుమతులు కూడా ఇస్తున్నాయి. కానీ హై కోర్టులు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఏడాది విడుదలైన ఓజీ, హరి హర వీరమల్లు, గేమ్ చేంజర్ మరియు అఖండ 2 వంటి భారీ చిత్రాలకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చాయి. కానీ తెలంగాణ హై కోర్టు మాత్రం పైన చెప్పిన 5 సినిమాలు విడుదల సమయం లో టికెట్ రేట్స్ జీవో ని రద్దు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేశాయి. దీంతో ఇక మీదట రాబోయే సినిమాలకు తెలంగాణ ప్రాంతంలో టికెట్ రేట్స్ దొరకడం కష్టమే .
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా రాబోయే రోజుల్లో ఇది పెద్ద సమస్య గా మారే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM PAwan Kalyan), అటు జనాలకు, ఇటు సినీ నిర్మాతలకు ఎలాంటి నష్టం చేయకుండా, ఒక శాశ్వతమైన జీవో ని రెడీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. సినిమాటోగ్రఫీ శాఖ జనసేన ఖాతాలోనే ఉంది. దానికి కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయనతో ఈ విషయమై చర్చించిన పవన్ కళ్యాణ్, నిర్మాతలు ప్రతీ సినిమా విడుదలకు తమ వద్దకు టికెట్ రేట్స్ పెంచమని అడిగే అవసరం లేకుండా, ఒక శాశ్వత పరిష్కారం వెతకాలని సూచించాడు. త్వరలోనే దుర్గేష్ సినీ ఇండస్ట్రీ కే సంబంధించిన ప్రముఖ దర్శక నిర్మాతలతో చర్చించబోతున్నాడు. ఆ తర్వాత ప్రత్యేక కమిటీ వేసి, టికెట్ రేట్స్ జీవో ని తీసుకొస్తారు.
టికెట్ రేట్స్ సినిమా బడ్జెట్ కి తగ్గట్టుగా ఉండేలా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట. ఈమధ్య కాలం లో టికెట్ రేట్స్ కి అనుమతులు ఇస్తున్నారు కదా అని , మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా టికెట్ రేట్స్ భారీ గా కోరుతున్నారు నిర్మాతలు. ఫలితంగా సామాన్యులపై భారీగా భారం పడుతోంది. దీన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారట. అంతే కాకుండా థియేటర్స్ క్యాంటీన్ లో దొరికే ఫుడ్ ఐటమ్స్ పై కూడా కంట్రోల్ తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అలా అన్ని విధాలుగా పరిశీలించి, ఒక శాశ్వత పరిష్కారం చూపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. మరి ఆ పరిష్కారం ఏంటో తెలియాలంటే వచ్చే నెల వరకు ఆగాల్సిందే. రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు వంటి భారీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. వీటికి టికెట్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి.