Vijay Hazare Trophy 2026: టీమిండియా కోచ్ గా వచ్చిన తర్వాత గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు.. అతడు తీసుకున్న నిర్ణయాలలో కొన్ని మాత్రమే జట్టుకు ఉపకరించాయి. మిగతావన్నీ జట్టుకు తీవ్రమైన నష్టాన్ని చేకూర్చాయి. గౌతమ్ గంభీర్ వ్యవహార శైలి తట్టుకోలేక రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. వన్డే ఫార్మాట్ లో ఆటగాడిగా మాత్రమే పరిమితమయ్యాడు. ఇక విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ ఫార్మేట్ నుంచి తప్పుకున్నాడు. వన్డే ఫార్మేట్లో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. వాస్తవానికి వీరిద్దరిని వన్డే ఫార్మాట్ నుంచి కూడా బయటికి పంపించాలని గౌతమ్ గంభీర్ అనుకున్నట్టు వినికిడి. రోహిత్ లో సామర్థ్యాన్ని, విరాట్ కోహ్లీలో లయ లేనితనాన్ని చూపించి, అవకాశాలు తప్పకుండా చేయాలని గౌతమ్ గంభీర్ అనుకున్నట్టు ఆరోపణలు వినిపించాయి.
గౌతమ్ గంభీర్ ఒకటి అనుకుంటే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరొకటి చేస్తున్నారు.. ఇటీవలీ ఆస్ట్రేలియా సిరీస్లో రోహిత్ శర్మ అదరగొట్టాడు. సెంచరీ, హాఫ్ సెంచరీ తో సంచలనం సృష్టించాడు. అదే లయను ఇటీవలి దక్షిణాఫ్రికా సిరీస్ లో కూడా కొనసాగించాడు. విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా సిరీస్ ద్వారా హాఫ్ సెంచరీ చేసి, టచ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా సిరీస్లో దుమ్ము రేపాడు. రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ తో భీకరమైన ఫామ్ కొనసాగించాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ నిబంధనల మేరకు అటు రోహిత్ శర్మ, ఇటు విరాట్ కోహ్లీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నారు.
విరాట్ కోహ్లీ ఢిల్లీ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఢిల్లీ జట్టుకు పంత్ నాయకత్వం వహిస్తున్నాడు. ఢిల్లీ గట్టు తరఫున ఆడుతున్న విరాట్ కోహ్లీ బెంగళూరు వేదికగా ఆంధ్ర జట్టుతో జరిగిన మ్యాచ్ అదరగొట్టాడు. 83 బంతుల్లో సెంచరీ చేసి సంచలన సృష్టించాడు. ఈ మ్యాచ్లో ఆంధ్ర జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.
ఆ తర్వాత చేజింగ్ మొదలుపెట్టిన ఢిల్లీ జట్టు 37.4 ఓవర్లలోనే 6 వికెట్ల నష్టపోయి 300 పరుగులు చేసింది.. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 101 బంతుల్లో 14 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 131 పరుగులు చేశాడు. ప్రియాంష్ ఆర్య 44 బంతుల్లో 74 పరుగులు చేశాడు. అంతకుముందు ఆంధ్ర జట్టు తరఫున రికీ భుయ్ 105 బంతుల్లో 122 పరుగులు చేశాడు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ 23 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
ఇక ఇదే విజయ్ హజారే ట్రోఫీలో జైపూర్ వేదికగా ముంబై, సిక్కిం జట్లు పోటీ పడ్డాయి. ముంబై జట్టు తరఫున ఆడిన రోహిత్ శర్మ 62 బంతుల్లో సెంచరీ చేశాడు. 94 బంతులు ఎదుర్కొన్న అతడు 18 ఫోర్లు, 9 సిక్సర్ల సహాయంతో 150 పరుగులు చేశాడు. లిస్ట్ క్రికెట్లో ఇది రోహిత్ శర్మకు అత్యంత వేగవంతమైన సెంచరీ. 2023లో ఢిల్లీలోని అరుణ్ జెట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్ జట్టు మీద 63 బంతుల్లో రోహిత్ సెంచరీ చేశాడు.
ఈ మ్యాచ్లో సిక్కిం ఫస్ట్ బ్యాటింగ్ చేసి, 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ముంబై జట్టు 30.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. అటు రోహిత్, ఇటు విరాట్ సూపర్ ఫామ్ లోకి రావడంతో గౌతమ్ గంభీర్, బిసిసిఐ ఇది తలపోటు లాంటి పరిణామం అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో రోహిత్ బరువు గురించి విపరీతంగా చర్చ జరిగేది. కానీ అతడు బరువు తగ్గి అత్యంత నాజూకుగా కనిపిస్తున్నాడు. ఇక విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.