https://oktelugu.com/

Pawan Kalyan Birthday Surprises : పవన్ బర్త్ డే సర్ ప్రైజ్ లు ఇవే !

Pawan Kalyan Birthday Surprises: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సర్ ప్రైజ్ ల హడావుడి ముగిసింది. మెగాభిమానులు మెగా పుట్టిన రోజును బాగా ఎంజాయ్ చేశారు. చిరు కూడా “భోళా శంకర్”, “గాడ్ ఫాదర్”, “మెగా 154” అంటూ వరుస సినిమాలతో ఫుల్ కిక్ ఇచ్చారు. అయితే, మరో వారం రోజుల్లో సోషల్ మీడియాలో మళ్ళీ హంగామా మొదలు కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) పుట్టిన రోజుకి ఇక […]

Written By: , Updated On : August 25, 2021 / 11:02 AM IST
Follow us on

Pawan Kalyan 50th BirthdayPawan Kalyan Birthday Surprises: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సర్ ప్రైజ్ ల హడావుడి ముగిసింది. మెగాభిమానులు మెగా పుట్టిన రోజును బాగా ఎంజాయ్ చేశారు. చిరు కూడా “భోళా శంకర్”, “గాడ్ ఫాదర్”, “మెగా 154” అంటూ వరుస సినిమాలతో ఫుల్ కిక్ ఇచ్చారు. అయితే, మరో వారం రోజుల్లో సోషల్ మీడియాలో మళ్ళీ హంగామా మొదలు కానుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) పుట్టిన రోజుకి ఇక వారమే సమయం ఉంది. మరి పవన్ పుట్టినరోజు నాడు సెప్టెంబర్ 2న ఎలాంటి సర్ ప్రైజ్ లు ఉండబోతున్నాయి. ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. కానీ పవన్ బర్త్ డే నాడు ఏ సినిమా నుండి ఎలాంటి అప్ డేట్ వస్తోంది అనేది ఇంతవరకు క్లారిటీ లేదు.

అయితే, ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల టాక్ ప్రకారం.. దర్శకుడు హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కలయికలో రానున్న సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ కాబోతుంది అని తెలుస్తోంది. ఈ మేరకు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ ఫై ఆ మధ్య ఒక స్పెషల్ ఫోటో షూట్ కూడా చేశాడట. పవన్ ఫోటో షూట్ చేసింది, ఫస్ట్ లుక్ కోసమేనట.

కాబట్టి, సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ – పవన్ కాంబినేషన్ లో వస్తోన్న ‘హరి హరి వీరమల్లు’ సినిమాకి సంబంధించి కూడా క్రేజీ అప్ డేట్ రాబోతుంది. అలాగే స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నిర్మాత రామ్ తాళ్లూరి ఒక భారీ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్ రాబోతుంది. అదేవిధంగా “భీమ్లా నాయక్” చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ ను పవన్ బర్త్ డే బూస్టర్ లా రిలీజ్ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ ఫస్ట్ సాంగ్ ను ఫినిష్ చేశాడు. మొత్తానికి పవన్ బర్త్ డే సర్ ప్రైజ్ లు ఇవే.