https://oktelugu.com/

Pawan Kalyan: పవన్ కళ్యాణ్, అట్లీ మూవీ షూటింగ్ ప్రారంభ తేదీ ఖరారు..న్యూ ఇయర్ రోజు ఫ్యాన్స్ కి బ్లాస్టింగ్ అప్డేట్!

నవంబర్ 11వ తారీఖు నుండి అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల వరకు ఉన్నందున, కొత్త షెడ్యూల్ ని 23వ తేదీ నుండి మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే తెలియనుంది.

Written By:
  • Vicky
  • , Updated On : November 7, 2024 / 04:06 PM IST

    Pawan Kalyan(36)

    Follow us on

    Pawan Kalyan: ఒకపక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్ ఎంత బిజీ గా ఉన్నాడో మనమంతా ప్రతీ రోజు చూస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పర్యటనలు ఇలా ఆయన క్షణం కాలం తీరిక లేకుండా గడుపుతున్నాడు. అసలు ఈయన కళ్లారా నిద్రపోతాడా అనే సందేహాలు కూడా అభిమానుల్లో ఉన్నాయి. రాజకీయంగా ఇంతటి బిజీ షెడ్యూల్ లో గడుపుతున్న ఆయన, మధ్యలో సినిమా షూటింగ్స్ కూడా చేస్తున్నాడు. గత కొద్దిరోజులుగా ‘హరి హర వీరమల్లు’ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న ఆయన, అతి త్వరలోనే ‘ఓజీ’, ‘ ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాల షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నాడు. నిన్నటి నుండి కొత్త షెడ్యూల్ మొదలవ్వాల్సింది, కానీ క్యాబినెట్ సమావేశాలు, ఢిల్లీ లో హోమ్ మినిస్టర్ అమిత్ షా తో భేటీ, మళ్ళీ నేడు శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోమ్ మినిస్టర్ అనిత తో సమావేశాలు, రేపు కర్నూల్ పర్యటన, ఇవన్నీ ఉండడంతో కొత్త షెడ్యూల్ వాయిదా పడింది.

    నవంబర్ 11వ తారీఖు నుండి అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల వరకు ఉన్నందున, కొత్త షెడ్యూల్ ని 23వ తేదీ నుండి మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే తెలియనుంది. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ తన చేతిలో ప్రస్తుతం ఉన్న మూడు సినిమాలే కాకుండా, ప్రముఖ పాన్ ఇండియన్ డైరెక్టర్ అట్లీ తో కూడా ఒక సినిమా చేయనున్నాడు. త్రివిక్రమ్ కథ, మాటలు అందించే ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. పవన్ కళ్యాణ్ ఈ మూడు సినిమాల తర్వాత ఇక సినిమాలు పూర్తిగా మానేస్తాడేమో అని ఆయన అభిమానులు నిరుత్సాహపడ్డారు. కానీ ఆయన రాబోయే రోజుల్లో కూడా సినిమాలు చేయనున్నాడు.

    డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అట్లీ చిత్రం తో పాటు మరో రెండు మూడు పాన్ ఇండియన్ సినిమాలను సెట్ చేసాడు. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన కొత్త సంవత్సరంలో వెలువడే అవకాశాలు ఉన్నాయట. ముఖ్యం గా అభిమానులు అట్లీ ప్రాజెక్ట్ మీద అమితాసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే అట్లీ కి ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు, రీసెంట్ గానే ఆయన హిందీలో షారుఖ్ ఖాన్ తో ‘జవాన్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని తీసాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ జనరేషన్ కి వింటేజ్ శంకర్ లాంటి దర్శకుడు అని పేరు తెచ్చుకున్న అట్లీ తో పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ సినిమా చేస్తే, బాక్స్ ఆఫీస్ వసూళ్లకు ఆకాశమే హద్దు అనే విధంగా ఉంటాయని ట్రేడ్ పండితులు ఇప్పటి నుండే అంచనా వేస్తున్నారు.