Pawan Kalyan- Sujeeth: టాలీవుడ్ లో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఊపు ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..రీ ఎంట్రీ తర్వాత ఆయన చేసిన వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి..అయితే వకీల్ సాబ్ సినిమా పీక్ కోవిద్ టైం లో రావడంతో పాటు, టికెట్ రేట్స్ లేకపోవడం..ఇక భీమ్లా నాయక్ సినిమాకి అయితే ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి రోజు నుండే అతి తక్కువ టికెట్ రేట్స్ ఉండడం తో పవన్ కళ్యాణ్ రేంజ్ బాక్స్ ఆఫీస్ నంబర్స్ అయితే రాలేదు కానీ, ప్రేక్షకాదరణ మాత్రం బాగా పొందాయి..ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులందరూ ‘హరి హర వీరమల్లు’ సినిమా కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు..పవన్ కళ్యాణ్ నుండి వస్తున్నా భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ..దానికి తోడు మొట్టమొదటిసారి ఆయన పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చెయ్యడం తో ఈ మూవీ కోసం కేవలం అభిమానులు మాత్రమే కాదు..ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే 60 శాతం కి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే మిగిలిన షూటింగ్ షెడ్యూల్స్ ని కూడా ప్రారంబించుకోనుంది..ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ప్రోమో కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఈ గ్యాప్ లో మరో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం..రన్ రాజా రన్ మరియు సాహూ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన సుజీత్ ఇటీవలే పవన్ కళ్యాణ్ ని కలిసి స్టోరీ వినిపించాడట..ఇందులో పవన్ కళ్యాణ్ మాఫియా డాన్ గా కనిపించబోతున్నట్టు సమాచారం..ఇటీవలే సుజీత్ తో పవన్ కళ్యాణ్ సినిమా , DVV ఎంటర్టైన్మెంట్స్ మీద ఈ సినిమా తెరకెక్కబోతుంది అంటూ వార్తలు రాగానే DVV ఎంటర్టైన్మెంట్స్ తన ట్విట్టర్ ఖాతా నుండి అలాంటిది ఏమి లేదు అంటూ ట్వీట్ వేసిన సంగతి మన అందరికి తెలిసిందే.

అయితే పవన్ కళ్యాణ్ ఈ విషయాన్నీ గోప్యంగా ఉంచామని చెప్పడం వల్లే DVV వాళ్ళు కూడా గోప్యంగా ఉంచారని..పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబినేషన్ లో అయితే సినిమా కచ్చితంగా ఉంది అని చెప్తున్నాయి విశ్వసనీయ వర్గాలు..ఇదే కనుక నిజం అయితే పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి పండగే అని చెప్పొచ్చు..ఎముకంటె డైరెక్టర్ సుజీత్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని..ఒక వీరాభిమాని తన అభిమాన హీరో తో సినిమా చేస్తే గబ్బర్ సింగ్ వచ్చింది..ఇప్పుడు కూడా సుజీత్ అలాంటి సినిమానే పవన్ కళ్యాణ్ కి అందిస్తాడని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు..ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలోనే తెలియనున్నాయి.