Pawan Kalyan Army Officer: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నుండి ఈ ఏడాది ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) మరియు ‘ఓజీ'(They Call Him OG) చిత్రాలు విడుదలయ్యాయి. ‘హరి హర వీరమల్లు’ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయితే,ఓజీ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఈ రెండు సినిమాలు తర్వాత పవన్ కళ్యాణ్ నుండి రాబోతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి అయ్యింది. ప్రాసయుతానికి ఆయన లేని సన్నివేశలను చిత్రీకరిస్తున్నారు. ఈ నెల చివర్లో షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అవుతుందని టాక్. వచ్చే ఏడాది మే నెలలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. రాశీ ఖన్నా,శ్రీలీలే ఈ చిత్రం లో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాట వచ్చే నెల 31న విడుదల కాబోతోంది.
ఇదంతా పక్కన పెడితే ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమా ఏమిటి?, హరి హర వీరమల్లు మూవీ ప్రొమోషన్స్ సమయంలో ప్రస్తుతం చేతిలో ఉన్న ఈ మూడు సినిమాలను పూర్తి చేస్తే చాలు, ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత సినిమాలు చేయకపోవుబంచు. ఎందుకంటే ఇప్పుడు అంత మంచి కథలు రాలేదని, వచ్చినప్పుడు చూద్దామని, కానీ రాజకీయాలే నా ప్రధాన టార్గెట్ అని, ఒకవేళ క్లాష్ వస్తే సినిమాలను ఆపేయడానికి ఏ మాత్రం ఆలోచించాననిన్ చెప్పుకొచ్చాడు. అయితే రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ ని ప్రముఖ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కలిశాడట. వీళ్లిద్దరి కాంబినేషన్ లో రామ్ తల్లూరి నిర్మాతగా ఒక సినిమాని ప్రకటించి చాలా కాలం అయ్యింది. పవన్ కళ్యాణ్ కి ఉన్న బిజీ కారణంగా ఆయన ఈ ప్రాజెక్ట్ చేయలేకపోయాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పట్టాలు ఎక్కనుంది. సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ కి రెండు కథలు వినిపించాడట.
ఒకటి ఓజీ తరహా లో గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమా. ఇందులో పవన్ కళ్యాణ్ తన కెరీర్ మొత్తం మీద తొలిసారి నెగిటివ్ షేడ్ ఉన్న క్యారక్టర్ లో కనిపిస్తాడట. ఇక అయన వినిపించిన రెండవ కథ ఇండియన్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. ఇందులో పవన్ కళ్యాణ్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తాడట. చాలా పవర్ ఫుల్ గా ఆయన ఈ రోల్ లో కనిపిస్తాడట. పవన్ కళ్యాణ్ ఆర్మీ ఆఫీసర్ స్క్రిప్ట్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది ద్వితీయార్థం లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారికం ప్రకటన బయటకు రానుంది .