PM Modi Puttaparthi Visit: పుట్టపర్తిలో ( Puttaparthi) శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. సత్య సాయి బాబా శివైక్యం తరువాత జరుగుతున్న అతిపెద్ద వేడుకలు కావడంతో ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ప్రశాంతి నిలయానికి చేరుకొని సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో ప్రశాంత నిలయంతోపాటు చుట్టుపక్కల ఆలయ భవనాలు రంగురంగుల దీపాలతో సుందరంగా కనిపిస్తున్నాయి.
1. సత్యసాయి బాబా జయంతి ఉత్సవాలకు ప్రముఖులు హాజరయ్యారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సినీనటి ఐశ్వర్యరాయ్ హాజరైన వారిలో ఉన్నారు. కాగా ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ ను మంత్రి నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అనగాని సత్య ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు.
Also Read: చంద్రబాబుపై వ్యతిరేకత లేదు.. జగన్ పై సానుకూలత లేదు.. ఎందుకిలా!
2. మంగళవారం నాడు శతజయంతి వేడుకలు ప్రారంభం అయ్యాయి. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆర్ జె రత్నాకర్ ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన వెండి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెండి రథం పై 9.2 కేజీల బంగారంతో తయారుచేసిన బాబా వారి ఉత్సవ మూర్తిని ఊరేగించారు
3. నవంబర్ 22న జరిగే శతజయంతి వేడుకలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతారని రత్నాకర్ తెలిపారు. 23న జరిగే జయంతి వేడుకలకు 23న జరిగే జయంతి వేడుకలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరవుతారు.