Pawan Kalyan : గత కొంతకాలం నుండి కూటమి లో చంద్రబాబు(Chandrababu Naidu), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మధ్య సఖ్యత లేదని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్న విషయాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గత 15 రోజులుగా ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడు. ఆయన శాఖలకు సంబందించిన పెండింగ్ ఫైల్స్ వేల సంఖ్యలో మంగళగిరి క్యాంప్ ఆఫీస్ లో పడున్నాయి. అసలు ఏమి జరుగుతుంది?, పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా ఎందుకు ఇంత సైలెంట్ అయిపోయాడు?, నారా లోకేష్(Nara Lokesh) ని డిప్యూటీ సీఎం చెయ్యాలనే డిమాండ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో బలంగా రావడం, ఆ డిమాండ్ ఇరు పార్టీల అధిష్టానం వరకు చేరడం, అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఈ అంశం గురించి చర్చ ఆపాలి అనే ఆదేశాలు జారీ అవ్వడం వంటి ఘటనలు జరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన 8 నెలల్లోనే పదవుల గురించి ఇలాంటి చర్చలు రావడం దురదృష్టకరం అంటూ ఇరు పార్టీల శ్రేయోభిలాషులు బాధ పడ్డారు.
త్వరలోనే కడపలో తెలుగు దేశం పార్టీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశాల్లో నారా లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పజెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా మంత్రి గా కూడా ఆయన ప్రమోట్ కానున్నాడు. ఒకవేళ అదే జరిగితే కూటమి నుండి తప్పుకుంటాను అనే సంకేతాలు పవన్ కళ్యాణ్ మౌనం ద్వారా తెలుగు దేశం పార్టీ కి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసారా?, అందుకే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కి కనీసం ఫోన్ కాల్ లో కూడా అందుబాటులోకి రావడం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా వచ్చే నెల 14 వ తారీఖున పిఠాపురం లో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ సమావేశం కనీవినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి సుమారుగా 3 లక్షల మంది ఈ సభకు హాజరు కాబోతున్నారని టాక్.
అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి, ఈ సమావేశం లో పవన్ కళ్యాణ్ భవిష్యత్తు రాజకీయ అడుగులపై కీలక కార్యకర్తలకు, పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేయబోతున్నాడు. అందులో భాగంగా ఆయన కూటమి కి వ్యతిరేకంగా ఏదైనా బలమైన నిర్ణయం తీసుకోబోతున్నాడా?, లేదా తెలుగు దేశం పార్టీ హద్దులు దాటి ప్రవర్తిస్తే ఎంతకైనా తెగిస్తాం అనే సంకేతం ఇవ్వబోతున్నాడా?, అసలు ఏమి జరగబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. కానీ ఎదో ఒక సంచలన ప్రకటన మాత్రం పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడని రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. అదే కనుక జరిగితే వైసీపీ పార్టీ శ్రేణులు పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు విడిపోతే, వాళ్ళిద్దరికీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం లేదు అనేది వాస్తవం. మరి ఏమి చేయబోతున్నారో చూడాలి.