Pawan Kalyan and Trivikram: మహాకవి శ్రీశ్రీ అంటేనే ఆవేశం, తెలుగు విప్లవ కవిత్వానికి ఆయనొక నిదర్శనం. అందుకే శ్రీశ్రీ ఒక శిఖరంలాంటి వారు. కాగా తాజాగా శ్రీశ్రీ మహాప్రస్థానంపై రూపొందించిన ఓ ప్రత్యేక పుస్తకాన్ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) త్రివిక్రమ్ (Trivikram) కు అందజేశారు. ‘భీమ్లా నాయక్’ సెట్ లో శ్రీశ్రీ పుస్తకాన్ని ఆవిష్కరించడం విశేషం. ఈ సందర్భంగా పవన్ – త్రివిక్రమ్ మధ్య సాగిన సంభాషణలు ఆకట్టుకున్నాయి.
త్రివిక్రమ్ మాటల్లో.. ‘శ్రీశ్రీ సమున్నత శిఖరం.. మనమంతా గులకరాళ్ళు’ అంటూ పవన్ కల్యాణ్ తో త్రివిక్రమ్ చెప్పిన మాట ఇది. ఈ క్రమంలోనే ‘శ్రీశ్రీ కవిత్వం గురించి మీరు రెండు మాటలు మాట్లాడంది. మీరు మాట్లాడితే వచ్చే అందం వేరు’ అని పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ ను కోరడం, త్రివిక్రమ్ కూడా శ్రీశ్రీ గొప్పతనం గురించి చెబుతూ బాగా ఆకట్టుకున్నారు.
త్రివిక్రమ్ మాటల్లోనే ‘కవి తాలూకు ప్రయాణం అంటే ఒక జాతి తాలూకు ప్రయాణం. ఆయన వేసిన ఒక అడుగు.. రాసిన ఒక పుస్తకం.. ఒక శతాబ్దం మొత్తం మాట్లాడుకుంటుంది.. చాలా శతాబ్దాలపాటు మాట్లాడుకొంటూనే ఉంటుంది. ఆయన తాలూకు జ్ఞాపకం మన జాతి పాడుకునే గీతం. శ్రీశ్రీ తెలుగువాళ్లు గర్వించదగ్గ కవి.. ఈ శతాబ్దం నాది అని గర్వంగా చాటినవాడు.
కవికుండాల్సిన ధిషణాహంకారం ఉన్నవాడు.. తెలంగాణ విమోచన దినోత్సవం రోజు ఆయన పుస్తకం చూడడం నిజంగా గొప్ప విషయం. ఆయన ఆత్మ ఎక్కడున్నా స్వతంత్రం అనే సరికి అక్కడికి వచ్చి ఆగుతుంది” అని త్రివిక్రమ్ శ్రీశ్రీ గురించి చాలా గొప్పగా చెప్పారు. ఇక త్రివిక్రమ్ మాటలు విన్న పవన్ కళ్యాణ్.. ‘ఒక కవి గురించి మరో కవి చెబితే వచ్చే సొబగు ఇది’ అంటూ నవ్వుతూ అనడం బాగుంది.
#PawanKalyan & #Trivikram recalling the greatness of legendary poet writer #SriSri garu while examining the new printed format of #MahaPrasthanam on #BheemlaNayak sets 🔥 pic.twitter.com/SyXjrW5smy
— Pulagam Chinnarayana (@PulagamOfficial) September 18, 2021