Pawan Kalyan and Surender Reddy Movie: ‘ఓజీ'(They Call Him OG), ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) సినిమాల షూటింగ్స్ ని పూర్తి చేసిన తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తన సమయాన్ని మొత్తం పాలనపైనే కేటాయించాడు. ప్రతీ రోజు ఎదో ఒక సమీక్ష సమావేశాలను నిర్వహిస్తూ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పట్లో సినిమాలు చేస్తాడా? లేదా అనే సందేహం అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఉండేది. కానీ కచ్చితంగా చేస్తాడు అనేది ఈ న్యూ ఇయర్ సందర్భంగా తెలిసిందే. ప్రముఖ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రాన్ని చేయబోతున్నాడు. రామ్ తల్లూరి ఈ చిత్రానికి నిర్మాత. ఓజీ తరహాలోనే ఇది కూడా ఒక పూర్తి స్థాయి బ్యాగ్ స్టర్ డ్రామా అని, పవన్ కళ్యాణ్ అభిమానులు మరోసారి గర్వం గా కాలర్ ఎత్తుకునే రేంజ్ సినిమా అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్.
అయితే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు మార్చి 1న ప్రారంభించబోతున్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. మే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెడుతారట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మైంటైన్ చేస్తున్న లుక్స్ ఆ చిత్రం కోసమే అని కొందరు అంటున్నారు . ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ, ఈ లుక్ కి మాత్రం ఫ్యాన్స్ నుండి డివైడ్ రెస్పాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ కి అసలు సూట్ అవ్వలేదని అంటున్నారు. కానీ ఆఫ్ లైన్ లో చూడడం, ఆన్ స్క్రీన్ పై చూడడం వెనుక చాలా పెద్ద తేడా ఉంటుంది. ఆఫ్ స్క్రీన్ లో నచ్చని లుక్స్ ఆన్ స్క్రీన్ లో నచ్చొచ్చు. చూడాలి మరి ఎలా ఉండబోతుంది అనేది. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ ని అందించాడు. వక్కంతం వంశీ కథలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. ఆయన పవర్ ఫుల్ కథకు, సురేందర్ రెడ్డి వింటేజ్ టేకింగ్ తోడైతే బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ అవుతాయి.
అయితే సురేందర్ రెడ్డి ప్రస్తుతం ఫార్మ్ లో లేడు. ఆయన గత చిత్రం ‘ఏజెంట్’ కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. సినిమా పరంగా కూడా అసలు ఇలాంటి సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు అంటే నమ్మడానికి చాలా కష్టం గా ఉంది అంటూ సోషల్ మీడియా లో అప్పట్లో ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు. అయితే ఆ సినిమాకు సురేందర్ రెడ్డి కేవలం కొంత భాగం మాత్రమే దర్శకత్వం వహించాడని, ఎక్కువ శాతం వక్కంతం వంశీ దర్శకత్వం వహించాడని , అందుకే ఔట్పుట్ అంత చెత్తగా వచ్చిందని, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తే ఆ సినిమా అలా ఉండేది కాదని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఓజీ రేంజ్ హైప్ క్రియేట్ చేస్తుందా లేదా అనేది.
Buzz:
Pk-surrender reddy project opening next month or march lo undachu— Bobby (@sekhar_ybsr) January 22, 2026