https://oktelugu.com/

Pawan Kalyan-Saundarya combination : పవన్ కళ్యాణ్, సౌందర్య కాంబినేషన్ లో మిస్ అయిన సూపర్ హిట్ చిత్రం అదేనా..? భయంతోనే పవన్ ఒప్పుకోలేదా!

కెరీర్ లో మైలు రాయిగా నిల్చిపోయిన చిత్రాలలో ఒకటి 'సుస్వాగతం'. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆరోజుల్లో కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిల్చి పవన్ కళ్యాణ్ ని హీరో గా నిలబెట్టింది. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ చేత కంటతడి పెట్టించాడు. ముఖ్యంగా తండ్రి రఘువరన్ కాంబినేషన్ లో వచ్చిన సన్నివేశాలన్నీ అద్భుతంగా ఉంటాయి.

Written By:
  • Vicky
  • , Updated On : November 3, 2024 / 09:51 PM IST

    Pawan Kalyan-Saundarya combination

    Follow us on

    Pawan Kalyan-Saundarya combination : ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సినీ కెరీర్ లో ఎన్నో క్రేజీ కాంబినేషన్స్ ని మిస్ అయ్యాడు. ఆయన వదులుకున్న సినిమాలను వేరే హీరోలు చేసి కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్నారు. ఆ హిట్స్ వాళ్ళను సూపర్ స్టార్స్ ని చేసాయి. పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయడానికి ఇండస్ట్రీ లో ఉన్నటువంటి టాప్ డైరెక్టర్స్ అందరూ అమితాసక్తి ని చూపిస్తారు. కానీ ఆయన మాత్రం కేవలం తనకి అనుకూలంగా ఉండే చిన్న డైరెక్టర్స్ తో పని చేయడానికే ఇష్టపడతాడు. అందుకు కారణం ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా డైరెక్టర్స్ నడుచుకోవాలి, పెద్ద డైరెక్టర్స్ తో ఆ కంఫర్ట్ ఉండదు కాబట్టే, కెరీర్ ప్రారంభం నుండి ఆయన చిన్న డైరెక్టర్స్ తోనే పని చేస్తూ వచ్చాడు. అదే విధంగా హీరోయిన్స్ విషయం లో కూడా పవన్ కళ్యాణ్ ఇష్టం మేరకే డైరెక్టర్స్ అప్పట్లో ఎంచుకునేవారట. ఆయన కెరీర్ లో మైలు రాయిగా నిల్చిపోయిన చిత్రాలలో ఒకటి ‘సుస్వాగతం’. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆరోజుల్లో కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిల్చి పవన్ కళ్యాణ్ ని హీరో గా నిలబెట్టింది. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ చేత కంటతడి పెట్టించాడు. ముఖ్యంగా తండ్రి రఘువరన్ కాంబినేషన్ లో వచ్చిన సన్నివేశాలన్నీ అద్భుతంగా ఉంటాయి.

    ఈ చిత్రంలో హీరోయిన్ గా దేవయాని నటించిన సంగతి తెలిసిందే. భీమినేని శ్రీనివాస రావు బుర్రలో అసలు దేవయాని ని హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనే లేదట. ఈ పాత్రకి సౌందర్య మాత్రమే న్యాయం చేయగలదు అని ఆయన బలంగా నమ్మేవాడట. సౌందర్య ని సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాడనే విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, వెంటనే అతనికి ఫోన్ చేసి దయచేసి సౌందర్య ని తీసుకోవద్దు అని భీమినేని రిక్వెస్ట్ చేసాడట. ఎందుకంటే సౌందర్య ఇండస్ట్రీ లో అప్పటికీ మహానటిగా చలామణి అవుతుంది. పవన్ కళ్యాణ్ అప్పుడే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొత్త హీరో. ఆమె నటన ముందు తాను తేలిపోతానేమో అనే భయం ఆయనలో ఉండేదట. పైగా వయస్సులో సౌందర్య పవన్ కళ్యాణ్ కంటే చాలా పెద్ద, అందుకే వద్దు అని చెప్పడంతో తమిళ ఇండస్ట్రీ నుండి దేవయాని ని ఖరారు చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రెస్పాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చింది.

    ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను సమర్థవతంగా చేపడుతూనే, మరోపక్క తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తున్నాడు. గత నెల రోజుల నుండి ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్న ఆయన, ఈ నెల 6వ తేదీ నుండి కొత్త షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. ఈ షెడ్యూల్ తో ఆయన పార్ట్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అవుతుంది. ఇది పూర్తి అయిన వెంటనే ఆయన ‘ఓజీ’ మూవీ సెట్స్ లోకి అడుగుపెడతాడు. ఈ రెండు సినిమాల కోసం అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ‘హరి హర వీరమల్లు’ చిత్రం మార్చి 28 వ తారీఖున విడుదల కాబోతుండగా, ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.