spot_img
Homeఎంటర్టైన్మెంట్వీరత్వాన్ని మేల్కొలపాలంటున్న పవన్.. !

వీరత్వాన్ని మేల్కొలపాలంటున్న పవన్.. !

Vakeel Saab New Year Poster
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ “వకీల్ సాబ్” నుండి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఇప్పటి వరకు లాయర్‌గానే దర్శనమిచ్చిన పవర్ స్టార్.. ఫస్ట్ టైమ్ హీరోయిన్ శృతి హాసన్‌తో కలిసి ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. నిజానికి ‘పింక్’ సినిమాలో హీరో పాత్రకు జోడీ లేకపోయినా.. తెలుగులో మాత్రం పవన్ కి హీరోయిన్ ను పెట్టారు. ఇక ఈ పోస్టర్ పవన్ ఫ్యాన్స్ ను బాగానే ఆకట్టుకుంటుంది. కాగా రాబోయే సంక్రాంతికి ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయాలనుకున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.

Also Read: పూరి జగన్నాథ్ బెస్ట్ ఇయర్ 2020నేనట తెలుసా?

అన్నట్టు నూతన సంవత్సరం సందర్భంగా పవన్ కల్యాణ్.. ‘ఎక్కడ వీరత్వం ఉండదో, అక్కడ పుణ్యం క్షీణిస్తుంది.. ఎక్కడ వీరత్వం ఉండదో, అక్కడ స్వార్థం జయిస్తుంది’ అంటూ శ్రీ రాంధారి సింగ్ కవితలోని లైన్లను పోస్ట్ చేసిన ఆయన.. ‘ఈ కొత్త సంవత్సరం, మన జాతిలోని వీరత్వాన్ని మేల్కొలపాలని కోరుకుంటూ, అందరికి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని ట్వీట్ ను పోస్ట్ చేశారు. ఇక వకీల్ సాబ్ మరో వారం రోజుల షూట్ బ్యాలెన్స్ ఉంది.

Also Read: ట్రైలర్ టాక్: ‘క్రాక్’ పుట్టించిన రవితేజ

అయితే రేపటి నుండి షూట్ మొదలుపెట్టి త్వరగా పూర్తి చేయాలని వరుస డేట్స్ ను పవన్ కేటాయించాడని తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వకీల్ సాబ్ కోసం వేసిన ప్రత్యేక భారీ కోర్టు సెట్ లో ఈ వారం రోజుల పాటు షూ ట్ జరుపుతారట. అనంతరం ఈ సినిమా పూర్తి అవుతుంది. ఆ తరువాత వెంటనే క్రిష్ తో చేస్తోన్న సినిమాను కూడా మొదలుపెడతాడట పవన్. పైగా క్రిష్ ఈ సినిమాని పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడని.. పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.

Vakeel Saab Movie

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Gautam Krishna

Gautam Krishna: మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ కోసం ముగ్గురు డైరెక్టర్ల ఎదురుచూపు…

Gautam Krishna: రాజకుమారుడు సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన హీరో మహేష్ బాబు... ఆ తర్వాత క్లాస్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాతో మాస్ హీరోగా అవతరించిన...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు అభిమానులకు చేదు వార్త.. ఊరించి దెబ్బ తీశారుగా..

Mahesh Babu: ప్రతీ ఏడాది మహేష్ బాబు అభిమానులు , తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఎంత గ్రాండ్ గా జరిపిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు...
Jana Nayagan Box Office Collection

Jana Nayagan Box Office Collection: ‘జన నాయగన్ ‘ కి డిజాస్టర్ టాక్.. కానీ మ్యాట్నీ షోస్...

Jana Nayagan Box Office Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళం ,...
Bandla Ganesh

Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇక అయిపోయినట్టే..

Bandla Ganesh: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కి సుప్రీం కోర్టు నుండి చాలా పెద్ద ఎదురుదెబ్బ నే తగిలింది. తనకు ఉన్నటువంటి స్థిరాస్తిని యూనియన్ బ్యాంకు వేలం వేయడాన్ని సమర్థిస్తూ...
India vs Zimbabwe

India vs Zimbabwe: టీమ్ ఇండియా వర్సెస్ జింబాబ్వే: అయ్యర్ సేన మీదనే ఒత్తిడి.. ఎందుకంటే

India vs Zimbabwe:  తెగించిన వాడికి తెడ్డే లింగం అన్నట్టుగా.. ఇటీవల టీమిండియాతో జరిగిన రెండు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో ఐర్లాండ్ ఆడింది. ఏకంగా రెండు మ్యాచ్లు గెలిచి.. టీమిడియాకు...
Oktelugu Epaper