
రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీలో 30.75 లక్షల మందికి ఇళ్లపట్టాలు అందజేస్తున్నామని తెలిపారు. బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం క్యాంప్ కార్యాలయంనుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.