పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – రానా దగ్గుబాటి కాంబినేషన్లో రాబోతున్న క్రేజీ మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’. అనౌన్స్ తోనే క్యూరియాసిటీ పెంచిన ఈ మూవీ.. లేటెస్ట్ గా విడుదల చేసిన గ్లింప్స్ తో అంచనాలు అమాంతం పెంచేసింది. లుంగీ ఎగ్గట్టి.. పవర్ ఫుల్ డైలాగ్స్, ఫైట్స్ తో పవన్ ఎంట్రీ ఇస్తే.. ‘నేనే హీరో’ అంటూ గర్జించాడు రానా. పవన్, రానా సింగిల్స్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే.. ఈ భారీ మల్టీస్టారర్ లో ఎవరి రెమ్యునరేషన్ ఎంత? అనే చర్చ అభిమానుల మధ్య జోరుగా సాగుతోంది.

ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించి రెండు టీజర్లు రిలీజ్ అయ్యాయి. ఇందులో పవన్ సోలోగా వచ్చిన టీజర్ రికార్డులు సృష్టించింది. వేగంగా 1 మిలియన్ లైక్స్ అందుకున్న టీజర్ గా సత్తా చాటింది. అయితే.. ఇందులో రానా కనిపించకపోవడంతో.. మల్టీస్టారర్ మూవీలో పవన్ ను మాత్రమే హైలెట్ చేశారనే విమర్శలు వచ్చాయి. అయితే.. రానాను మరోసారి బరిలోకి దింపేందుకు ప్లాన్ చేసినట్టు యూనిట్ ప్రకటించింది. అన్నట్టుగానే రానాకు సంబంధించి స్పెషల్ టీజర్ వదిలింది. పవన్ ను గబ్బర్ సింగ్ అని చెప్పిన రానా.. తాను ధర్మేంద్ర అని, తానే హీరో అని గర్జించాడు.
దీంతో.. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే.. థియేట్రికల్ రిలీజ్ డేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని ప్రకటించారు మేకర్స్. అటు పందెం పుంజులు.. ఇటు పవన్-రానా పోరు అదరహో అనిపించబోతున్నాయి. థియేట్రికల్ రిలీజ్ తర్వాత.. ఓటీటీ డీల్ కూడా ఫిక్స్ అయ్యిందని టాక్.
భీమ్లానాయక్ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఇందుకోసం ఎంత చెల్లిస్తోంది అన్న ఫిగర్ బయటకు రాలేదుగానీ.. భారీ మొత్తంలో డీల్ సెట్ చేసుకున్నట్టు సమాచారం. పవర్ స్టార్ రీ-ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ కూడా అమెజాన్ లోనే స్ట్రీమ్ అయ్యింది. ఇప్పుడు భీమ్లానాయక్ కూడా అమెజాన్ లోనే ప్లే కానుంది. సినిమా విడుదలకానున్న జనవరి 12 తర్వాత సరిగ్గా నెల రోజులకు స్ట్రీమింగ్ చేయనున్నట్టు సమాచారం.
ఇంతటి భారీ చిత్రానికి పవన్-రానా ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు? అనేది ఇంట్రస్టింగ్ పాయింట్ గా మారింది. పవన్ సినిమాలో మేజర్ రోల్ ప్లే చేస్తారు కాబట్టి.. ఇందుకోసం 50 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నట్టు టాక్. ఇక, రానా విషయానికి వస్తే.. ఆయనకు కాల్ షీట్ల ఆధారంగా రెమ్యునరేషన్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. 25 రోఉల డేట్స్ ఇచ్చిన రానాకు 4 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. మరి, ఈ గబ్బర్ సింగ్ – భళ్లాల దేవ సమరం ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.