Pawan Kalyan And Lokesh Kanagaraj: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులకు ఓజీ(They Call Him OG) చిత్రం నుండి మంచి రోజులు మొదలయ్యాయి. ఈ సినిమా భారీ కమర్షియల్ హిట్ అవ్వడమే కాకుండా, పవన్ కళ్యాణ్ మైండ్ సెట్ ని పూర్తిగా మార్చేసింది. ఇంతకు ముందు లాగా రీమేక్ సినిమాలు కాకుండా, క్రేజీ కాంబినేషన్ సినిమాలే చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగానే ఇప్పుడు ప్రముఖ టాప్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా చేయడానికి పవన్ సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడ లో టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌస్ గా పిలవబడే KVN ప్రొడక్షన్స్ సంస్థ రీసెంట్ గానే రెండు సార్లు పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపారు. వీళ్ళతో సినిమా చేయడానికి పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, పది కోట్ల రూపాయిల అడ్వాన్స్ కూడా తీసుకున్నాడని టాక్ వినిపిస్తుంది. KVN వద్ద లోకేష్ కనకరాజ్ డేట్స్ కూడా ఉన్నాయి.
దీంతో పవన్ కళ్యాణ్ తో సినిమా సెట్ చేయడానికి ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఒక సాలిడ్ స్టోరీ లైన్ సిద్ధం చేసి పెట్టి ఉంచాడట. కేవలం పవన్ కళ్యాణ్ కి న్యారేషన్ ఇవ్వడమే బ్యాలన్స్ ఉంది. అది జరిగిన రోజు, ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన చేయబోతున్నారు. లోకేష్ కనకరాజ్ రీసెంట్ గానే సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలీ చిత్రాన్ని తెరకెక్కించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆసించిన స్థాయి విజయం సాధించలేక పోయినప్పటికీ, కమర్షియల్ గా 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ చిత్రానికి ముందు లోకేష్ తీసిన లియో, విక్రమ్, మాస్టర్, ఖైదీ వంటి చిత్రాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి. లోకేష్ కనకరాజ్ హీరో తో సంబంధం లేకుండా భారీ వసూళ్లను కొల్లగొట్టే కెపాసిటీ ఉన్నోడు.
ఇక పవన్ కళ్యాణ్ గురించి తెలిసిందే, రీసెంట్ గానే ఆయన ఓజీ చిత్రం డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, సింగిల్ లాంగ్వేజ్ నుండి 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించాడు. మొదటి రోజు అయితే ఏకంగా 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరో, సౌత్ లోనే టాప్ మోస్ట్ డైరెక్టర్ అయినటువంటి లోకేష్ తో సినిమా చేస్తున్నాడు అంటే ఇక అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు. లోకేష్ కనకరాజ్ తన మార్క్ టేకింగ్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తే కచ్చితంగా ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో రికార్డ్స్ షేక్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశం ఉండదు. వచ్చే ఏడాది చివర్లో మొదలయ్యే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గా తన బాధ్యతల్లో బిజీ గా ఉండనున్నాడు.