https://oktelugu.com/

జనవరి 4 నుండి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ !

క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా జనవరి 4 నుంచి షూట్ స్టార్ట్ కానుంది. ఈ మేరకు పవన్ తన డేట్స్ ను ఈ సినిమాకి కేటాయించాడు. మొదటగా సాంగ్ ను షూట్ చేయాల్సి ఉంది. నిజానికి పోలాచ్చి వెళ్లి శృతి హాసన్ కాంబినేషన్ లో డ్యూయట్ చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ, కరోనా కారణంగా అది సాధ్యం కాలేదు. అలాగే రెండు సాంగ్స్ షూట్ చేయాలి. కానీ, ఒక సాంగ్ తీసేసి.. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 30, 2020 / 06:12 PM IST
    Follow us on


    క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా జనవరి 4 నుంచి షూట్ స్టార్ట్ కానుంది. ఈ మేరకు పవన్ తన డేట్స్ ను ఈ సినిమాకి కేటాయించాడు. మొదటగా సాంగ్ ను షూట్ చేయాల్సి ఉంది. నిజానికి పోలాచ్చి వెళ్లి శృతి హాసన్ కాంబినేషన్ లో డ్యూయట్ చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ, కరోనా కారణంగా అది సాధ్యం కాలేదు. అలాగే రెండు సాంగ్స్ షూట్ చేయాలి. కానీ, ఒక సాంగ్ తీసేసి.. కేవలం ఒక్క మాంటేజ్ సాంగ్ మాత్రమే చిత్రీకరించనున్నారు. ఇక పవన్ నిన్నటితో వకీల్ సాబ్ షూట్ పూర్తి కావడంతో… క్రిష్ సినిమాని కూడా శరవేగంగా పూర్తి చేయడానికి పవన్ రెడీ అవుతున్నాడు.

    Also Read: ఆయనకే హిట్ లేదు.. ఆయనేం హిట్ ఇస్తాడు !

    అయితే దాదాపు రెండు వారాల పాటు షూట్ జరగుందని తెలుస్తోంది. ఇక ప్రజెంట్ వైష్ణవ్ తేజ్ సినిమాను ముగించే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు క్రిష్. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్యాచ్ వర్క్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ షూట్ జరుగుతుంది. రేపటితో ఈ షూట్ కూడా పూర్తి కానుంది. ఇక ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని.. వైష్ణవ్ తేజ్ కెరీర్ లోనే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని.. అందుకే అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తాన్ని ఇవ్వడానికి రెడీగా ఉందని తెలుస్తోంది. పవన్ ఆల్ రెడీ ఈ సినిమా చూసాడట. పవన్ కి సినిమా చాలా బాగా నచ్చిందని సమాచారం. క్రిష్ ను పిలిచి ప్రత్యేకంగా అభినందించాడట పవన్.

    Also Read: ఎవరయ్యా అతన్ని పిలిచింది..!

    నిజానికి క్రిష్ డైరెక్షన్ లో వైష్ణవ్ తేజ్ రెండో సినిమా చేయడానికి పవనే కారణమని తెలిసిందే. పవర్ స్టార్ చెప్పడంతోనే క్రిష్ ఈ సినిమా చేశాడని, పైగా సబ్జెక్ట్ కూడా పవనే సూచించాడని, కొండపొలం అనే నవలను సినిమాగా తీయమని పవన్ చెబితేనే క్రిష్ చేశాడని కూడా తెలిసిందే. ఇక క్రిష్ డైరెక్షన్ లో పవన్ చేస్తోన్న సినిమాను మార్చి కల్లా పూర్తి చేసి.. ఉగాదిగా స్పెషల్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ లో ఉన్నారు. ఆ తరువాత ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ చేయబోతున్నాడు. క్రిష్ కు తోడుగా నిర్మాత ఏ.ఎమ్.రత్నం కూడా షూట్ త్వరగా స్టార్ట్ చేయడానికి రంగంలోకి దిగారు. ఈ చిత్రానికి ఆయనే నిర్మాత. ప్రస్తుతం ఏ.ఎమ్.రత్నం హైదరాబాద్లోనే ఉండి షూట్ ప్లాన్ చేస్తున్నారట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్