https://oktelugu.com/

Pawan Kalyan and Harish Shankar: పవన్ – హరీష్ సినిమా పై క్లారిటీ !

Pawan Kalyan and Harish Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఐదు సినిమాలు చేస్తున్నారని వార్తలు అయితే వస్తున్నాయి గానీ, వాటిల్లో మూడు సినిమాలు మాత్రమే పవన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. మిగిలిన సినిమాల విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. అయితే, తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) తో చేస్తోన్న సినిమా పై పవన్ నుంచి క్లారిటీ వచ్చింది. పవన్ – హరీష్ శంకర్ సినిమా ఎప్పుడు […]

Written By: , Updated On : September 7, 2021 / 11:42 AM IST
Follow us on

Pawan Kalyan and Harish ShankarPawan Kalyan and Harish Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఐదు సినిమాలు చేస్తున్నారని వార్తలు అయితే వస్తున్నాయి గానీ, వాటిల్లో మూడు సినిమాలు మాత్రమే పవన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. మిగిలిన సినిమాల విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. అయితే, తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) తో చేస్తోన్న సినిమా పై పవన్ నుంచి క్లారిటీ వచ్చింది.

పవన్ – హరీష్ శంకర్ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అంటే.. నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అట. 2023 సంక్రాంతికి హరీష్ శంకర్ – పవన్ సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డేను ఫైనల్ చేశారట. అన్నట్టు ఈ చిత్రానికి ‘భగత్ సింగ్’ అనే టైటిల్ పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే హరీష్ శంకర్, పవన్ కోసం పూర్తి స్క్రిప్ట్ ను పూర్తి చేశాడు. ఈ సినిమాలో వెరీ పవర్ ఫుల్ రోల్ లో పవన్ కళ్యాణ్ నటించబోతున్నాడు. ముఖ్యంగా పవన్ ప్లాష్ బ్యాక్ లో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తాడని.. పైగా పవన్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. అంటే ప్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్రలోనూ.. అలాగే లైవ్ లో వచ్చే కొడుకు పాత్రలోనూ పవనే నటిస్తున్నాడు.

కాగా తండ్రి పాత్రది పోలీస్ ఆఫీసర్ పాత్ర అట. తన తండ్రి మరణానికి కారణం అయిన వాళ్ల పై హీరో ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనే కోణంలో కథ సాగుతుంది. కథ పాతది అయినా, కథనం కొత్తగా ఉంటుందట. పవన్ ఈ సినిమాలో ముందెన్నడూ కనిపించని లుక్ లో కనిపించబోతున్నాడు.

ఎంతైనా పవన్ కళ్యాణ్ సినిమా అంటే వందల కోట్ల వ్యాపారం. అందుకే హరీష్ శంకర్ దాదాపు ఏడాది నుండి నలుగురు రైటర్స్ తో కూర్చుని సినిమాని సెట్ చేసుకుంటున్నాడు. మరి చూద్దాం హిట్ కొడతాడో లేదో.