https://oktelugu.com/

Pawan Kalyan – Allu Arjun : ఒకే వేదిక పైకి రాబోతున్న పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్..అభిమానుల ప్రశ్నలకు సమాధానం దొరికినట్టే!

పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇప్పుడు ఒకే వేదికపై కనిపించబోతున్నారు అన్నమాట. వీళ్ళు కలిసి ఆప్యాయంగా ఒకరిని ఒకరు పలకరించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలోకి వస్తే ఇప్పటి వరకు జరిగిన గొడవలన్నీ అభిమానులు మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : August 29, 2024 / 08:00 PM IST

    Pawan Kalyan - Allu Arjun

    Follow us on

    Pawan Kalyan – Allu Arjun : గత మూడు నెలలుగా సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య ఏ స్థాయిలో గొడవలు జరుగుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. నంద్యాలలో వైసీపీ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే శిల్పా రవికి వెళ్లి అల్లు అర్జున్ సపోర్ట్ చెయ్యడం దగ్గర నుండి ఈ వివాదం మొదలైంది. అక్కడి నుండి చిలికి చిలికి గాలి వానలాగ మారి ఇప్పుడు రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు పరస్పరం విమర్శలు, కౌంటర్లు వేసుకునే స్థాయికి చేరుకుంది. మరోపక్క మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు, అల్లు అర్జున్ ని కూడా సమానంగా చూసే అభిమానులు ఈ గొడవకి ఎప్పుడు ముగింపు వస్తుందో అని ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. కానీ అది నిన్న మొన్నటి వరకు సాధ్యం కాదేమో అనే వాతావరణమే కనిపించింది. కానీ లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వచ్చిన ఒక వార్తని చూసి, ఈ గొడవలకు ఇక తెరపడుతుంది అనే ఆశ అభిమానుల్లో చిగురించింది.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే సెప్టెంబర్ 1 వ తేదీన నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 50 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆయన్ని ఘనంగా సత్కరించుకునేందుకు హైదరాబాద్ లో ఒక గ్రాండ్ ఈవెంట్ ని ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ కి నిన్న అల్లు అర్జున్ కి కూడా ఆహ్వానం దక్కింది. ఆయనతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు కూడా ఆహ్వానం అందింది. అంటే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇప్పుడు ఒకే వేదికపై కనిపించబోతున్నారు అన్నమాట. వీళ్ళు కలిసి ఆప్యాయంగా ఒకరిని ఒకరు పలకరించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలోకి వస్తే ఇప్పటి వరకు జరిగిన గొడవలన్నీ అభిమానులు మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్షణం కోసమే అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు.

    అల్లు అర్జున్ తో పాటుగా మెగాస్టార్ చిరంజీవి కి కూడా ఈ ఈవెంట్ లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు మొత్తం ఈ ఈవెంట్ కి హాజరు అవ్వాల్సిందిగా ఆహ్వానాలు అందాయి. అలాగే తమిళనాడు నుండి సూపర్ స్టార్ రజినీకాంత్, కర్ణాటక నుండి శివ రాజ్ కుమార్ వంటి వారు కూడా ఈ ఈవెంట్ కి రాబోతున్నారు. ఎంతో ఘనంగా జరగబోతున్న ఈ ఈవెంట్ కోసం ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 1974 వ సంవత్సరం లో ‘తాతమ్మ కల’ అనే చిత్రం ద్వారా బాలయ్య వెండితెర అరంగేట్రం చేసాడు. ఈ 50 ఏళ్ళ సినీ ప్రస్థానంలో తాను తప్ప ఇండియా లో ఎవ్వరూ చెయ్యలేరు అనే తరహా పాత్రలను ఎన్నో పోషించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బద్దలు కొడుతున్న అతి తక్కువమంది ఇండియన్ హీరోలలో బాలయ్య ఒకడిగా నిలబడడం మామూలు విషయం కాదు. అలాంటి హీరోకి తెలుగు సినిమా ఇండస్ట్రీ సరైన గౌరవం ఇస్తుందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.