Nara Lokesh : సాక్షిని వెంటాడుతున్న లోకేష్.. రూ.75 కోట్లు కట్టించగలరా?

గత ఐదేళ్లుగా సాక్షి పత్రిక టిడిపి వైఫల్యాలను బయటపెట్టింది. ఈ క్రమంలో లోకేష్ పై ఒక కథనం సంచలనం గా మారింది. దానిపైనే లోకేష్ న్యాయపోరాటం చేయడం ప్రారంభించారు.

Written By: Dharma, Updated On : August 29, 2024 8:07 pm

Nara Lokesh

Follow us on

Nara Lokesh :ఏపీలో పార్టీల పరంగా మీడియా విభజనకు గురైంది. అయితే వైసీపీకి అధికారికంగా సాక్షి పత్రిక ఉంది. టిడిపికి అనుకూలంగా ఎలాగూ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉంది. వీటికి తోడు మహా టీవీ, టీవీ5 ఉన్నాయి. మిగతావి తటస్థ మీడియా. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. వారికి అనుకూలంగా వ్యవహరిస్తాయి. అయితే తాజాగా సాక్షి పత్రిక పై పరువు నష్టం దావా వేశారు మంత్రి లోకేష్. చాలా రోజుల కిందటే వేశారు. ఈరోజు కోర్టుకు హాజరయ్యారు. తన వాంగ్మూలం ఇచ్చారు. తనతో పాటు ప్రభుత్వ ఇష్టము మంటగలిగేందుకు సాక్షి ప్రయత్నించిందని చెప్పుకొచ్చారు. తన పరువుకు భంగం వాటిల్లినందున 75 కోట్ల రూపాయలు పరిహారం ఇప్పించాలని కోరారు. దీనిపై వాదనలు కూడా జరిగాయి. విచారణ మరోసారి వాయిదా పడింది.

* చినబాబు చిరుతిళ్ళు
కొద్ది రోజుల కిందట సాక్షిలో ‘చినబాబు చిరు తిండి 25 లక్షలు అండి’ కథనం ఒకటి వచ్చింది. మంత్రి కార్యాలయంలో కాస్ట్లీ బిస్కెట్లు, మినరల్ వాటర్ కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారన్నది ఈ కథనం సారాంశం. అయితే దీనిపై విశాఖలోని కోర్టును ఆశ్రయించారు లోకేష్. పరువు నష్టం దావా వేశారు. వివిధ కారణాలతో చాలా రోజులుగా ఈ కేసు విచారణ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈరోజు విచారణ ప్రారంభమైంది. మంత్రి లోకేష్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. తన వాంగ్మూలం ఇచ్చారు.

* సాక్షి టార్గెట్
ఈ ఎన్నికలకు ముందు నుంచే లోకేష్ సాక్షిని టార్గెట్ చేసుకున్నారు. ప్రతి ప్రెస్ మీట్ లో సాక్షి ప్రస్తావన తీసుకొచ్చారు. సాక్షి విలేఖరి గురించి ఆరా తీసేవారు. సాక్షి విలేఖరి వచ్చాడా అని ప్రశ్నించేవారు. సాక్షితో పాటు మరికొన్ని ప్రైవేటు మీడియా ఛానళ్లపై లోకేష్ సెటైరికల్ గా మాట్లాడుతుండేవారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో సీరియస్ యాక్షన్ కు దిగారు . ముందుగా సాక్షిపై పడ్డారు.

* ఇటీవల కామన్
అయితే పత్రికల్లో వ్యతిరేక కథనాలు వచ్చినప్పుడు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించడం ఇటీవల పరిపాటిగా మారింది. ముంబై నటి విషయంలో జరిగిన వ్యవహారంపై ఈనాడులో ప్రత్యేక కథనం వచ్చింది. అందులో సజ్జల ప్రస్తావన ఉంది. దీంతో ఆయన ఈనాడు పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అయితే సజ్జలే కాదు చాలామంది నేతలు ఇలానే ప్రకటించారు. కానీ వేయలేకపోయారు. లోకేష్ మాత్రం చాన్నాళ్ళ కిందటే పరువు నష్టం దావా వేశారు. దానిపై ఆయన వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకున్నారు. ఇప్పుడు విచారణకు స్వయంగా హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.