Pawan Kalyan Samudra Khani : రీ ఎంట్రీ తర్వాత వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే..ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో శరవేగంగా సాగుతుంది..సుమారు 900 మంది ఆర్టిస్టులు ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటుగా పాల్గొంటున్నారు..దాదాపుగా నెల రోజుల నుండి ఈ షెడ్యూల్ జరుగుతుంది..ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఏ చిత్రం చెయ్యబోతున్నాడు అనేది సరైన క్లారిటీ లేదు..హరీష్ శంకర్ తో చాలా కాలం క్రితమే ఆయన ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే చిత్రాన్ని ప్రకటించాడు.

వకీల్ సాబ్ సినిమా తర్వాత ఈ సినిమానే పట్టాలెక్కాల్సింది..కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్యలో భీమ్లా నాయక్ చిత్రాన్ని ఇరికించేలోపు భగత్ సింగ్ వెనక్కి వెళ్ళాడు..పోనీ భీమ్లా నాయక్ సినిమా తర్వాత అయితే ప్రారంభం అవుతుందా అనుకుంటే ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ లో మరియు రాజకీయ కార్యకలాపాలలో బిజీ అయిపోయాడు.
అయితే ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’ తర్వాత పవన్ కళ్యాణ్ చెయ్యబొయేది డైరెక్టర్ హరీష్ శంకర్ తో అనే క్లారిటీ అయితే వచ్చేసినట్టు తెలుస్తుంది..అది ‘భవదీయుడు భగత్ సింగ్’ లేదా కొత్త స్టోరీ అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది..ఈ సినిమా తో పాటుగా యువ డైరెక్టర్ సుజీత్ కూడా ఒక సినిమా సమాంతరంగా చెయ్యబోతున్నట్టు టాక్..ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ఆ మధ్యలో తమిళం లో సూపర్ హిట్ గా నిలిచినా ‘వినోదయ్యా చిత్తం’ అనే రీమేక్ ని చెయ్యబోతున్నట్టు..పూజ కార్యక్రమాలు కూడా జరిగిపోయినట్టు అధికారిక ప్రకటన జరిగింది..ఈ ప్రాజెక్ట్ ని ప్రస్తుతం అటకెక్కించేసాడట పవన్ కళ్యాణ్..ఇందుకు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు..ఎందుకంటే ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కి ఏ మాత్రం సూట్ అవ్వదు..పైగా రీమేక్ లకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా విసిగెత్తిపోయారు.
ఇదంతా ఒక ఎత్తైతే ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్ట్ సముద్ర ఖని ఈ చిత్రానికి దర్శకుడు అవ్వడం ఫ్యాన్స్ అసలు జీర్ణించుకోలేకపోయారు..ఇటీవలే సముద్ర ఖని పవన్ కళ్యాణ్ ని కలిసి ఫైనల్ న్యారేషన్ ఇచ్చాడట..పవన్ కళ్యాణ్ ఏ మాత్రం సంతృప్తిగా లేదట ఈ కథమీద..ఇప్పుడు కుదరదు లేండి, ఇంకెప్పుడైనా చేద్దాం అని చెప్పి సముద్ర ఖని ని పంపేసాడట..ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.