Pawan Kalyan – Aarti Aggarwal : సౌత్ ఇండియా లో ఏ హీరోయిన్ కి అయినా పవన్ కళ్యాణ్ సరసన నటించాలి అనుకుంటుంది. ఎందుకంటే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తే హిట్ మరియు ఫ్లాప్ తో సంబంధమే లేకుండా మంచి ఫేమ్ మరియు రీచ్ వస్తుంది. ఆయన పక్కన నటించడం అనేది ఒక అదృష్టం గా భావిస్తారు అలాంటి అదృష్టాన్ని మిస్ అయ్యింది అప్పటి స్టార్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్.
ఇక అసలు విషయం లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ మరియు కరుణాకరన్ కాంబినేషన్ లో అప్పట్లో ‘బాలు’ అనే సినిమా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే . ఈ సినిమా కమర్షియల్ గా యావరేజి అయ్యినప్పటికీ, అభిమానులకు వ్యక్తిగతం గా ఎంతో ఇష్టమైన సినిమాలలో ఒకటిగా నిల్చింది. అయితే ఇందులో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరోయిన్ పాత్ర అప్పట్లో ఒక సెన్సేషన్.
సినిమా విడుదలైన తర్వాత అందరూ ఈ పాత్ర గురించి ప్రత్యేకించి మాట్లాడుకున్నారు. అంతలా సెన్సేషన్ సృష్టించిన ఈ పాత్ర కోసం ముందుగా ఆర్తి అగర్వాల్ ని అడిగారట. ఆమెకి ఈ సినిమాలో నటించే ఛాన్స్ దక్కడం తో ఎగిరి గంతులేసినంత పని అయ్యింది. అందులోనూ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేసే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ అప్పట్లో కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పుకొచ్చింది ఆర్తి అగర్వాల్.
అయితే అప్పటికే కమిట్ అయినా ఒక సినిమా షెడ్యూల్, అనుకున్న దానీకాంతే ముందుగా జరపాల్సి వచ్చిందట. అదే సమయం లో బాలు సినిమాకి కూడా డేట్స్ కేటాయించాల్సిన పరిస్థితి. దీనితో ఈమె బాలు సినిమాని అయిష్టంతోనే వదులుకోవాల్సి వచ్చింది. అంత మంచి పాత్ర మిస్ అవ్వడం ఆర్తి అగర్వాల్ బ్యాడ్ లక్ అనే చెప్పాలి. కానీ కొన్ని సార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురుకోక తప్పదు. ఇప్పుడు ఆమె బౌతికంగా మన మధ్య లేదు అనీ విషయం మన అందరికీ తెలిసిందే.